Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ బుక్ ఇదే అంట.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన బన్నీ..

నేడు అల్లుఅర్జున్ తన సోషల్ మీడియాలో తన ఫేవరేట్ బుక్ అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ బుక్ ఇదే అంట.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన బన్నీ..

Allu Arjun

Updated On : August 9, 2025 / 2:25 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేయనున్నాడు. ఇటీవలే ముంబైలో వర్క్ షాప్ పూర్తి చేసుకొని వచ్చాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. నేడు అల్లుఅర్జున్ తన సోషల్ మీడియాలో తన ఫేవరేట్ బుక్ అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

అల్లు అర్జున్ “The Creative Act: A Way of Being” అనే పుస్తకాన్ని షేర్ చేస్తూ.. హ్యాపీ నేషనల్ బుక్ లవర్స్ డే అందరికి. ఈ సందర్భంగా నేను నా ఫేవరేట్ పుస్తకాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రిక్ రూబిన్ రాసిన “The Creative Act: A Way of Being” పుస్తకం నా ఫేవరేట్. క్రియేటివ్ ఫీల్డ్ ఉన్న అందరూ ఈ బుక్ చదవాలని రికమండ్ చేస్తున్నాను. ఈ బుక్ నిజంగా నా జీవితాన్ని మార్చేసింది. రిక్ రూబిన్ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఈ బుక్ రాసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈ బుక్ ని నాకు గిఫ్ట్ గా ఇచ్చిన చాయ్ బిస్కెట్ శరత్ కి ధన్యవాదాలు అని తెలిపారు.

Also Read : Chiranjeevi : చిరంజీవితో ఫిలిం ఫెడరేషన్ మీటింగ్.. నేను పెంచుతాను అంటూ మెగాస్టార్..

దీంతో అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ గా మారగా ఈ బుక్ ఏంటి అని తెగ వెతికేస్తున్నారు. “The Creative Act: A Way of Being” అనే బుక్ ని అమెరికన్ రచయిత రిక్ రూబిన్ రాసారు. ఒక కళాకారుడు జీవితం గురించి ఫిలాసఫీగా ఉండే పుస్తకం ఇది. అమెరికాలో బెస్ట్ సెల్లర్ గా అనేక అవార్డులు అందుకుంది ఈ పుస్తకం. మీరు కూడా ఈ బుక్ కావాలనుకుంటే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేయండి.

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

 

Also Read : Tollywood Strike : టాలీవుడ్ సమ్మె.. ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాదయాత్ర..