బన్నీ వదిన ఫన్ ఛాలెంజ్.. అల్లు వారి కోడలు అదుర్స్ అంటున్న నెటిజన్స్..

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులు, వర్కౌట్స్, ఫొటోలు, వీడియోలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్(బాబీ) సతీమణి నీలు షా ఓ ఫన్ ఛాలెంజ్ చేసి చూపెట్టారు.
కాళ్లకు సాక్స్‌లు ధరించి శీర్షాసనం వేసిన ఆమె.. ఒక కాలితో మరో కాలికి ఉన్న సాక్స్‌ను తొలగించారు. ఇలా శీర్షాసనంలో ఉండగానే రెండు కాళ్లకు ఉన్న సాక్స్‌లను తొలగించేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, Fun challenge accepted అని పేర్కొన్నారు.
అలాగే ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉండాలని.. సురక్షితంగా ఉండాలని ఆమె కోరారు. ‘బన్నీ వదిన ఫన్ ఛాలెంజ్ సూపర్.. అల్లు వారి కోడలు అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్..ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.