Amit Shah – Jr.NTR Meeting : అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. RRR సినిమా చర్చ కోసమా? రాజకీయం కోసమా?
రాజకీయ సభ కోసం రానున్న అమిత్ షా తన పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ని కలవనున్నారు. అమిత్ షా నేడు ఆదివారం రాత్రి నోవాటెల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అవ్వనున్నారు. దీంతో అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.........

Amit Shah will meet Jr.NTR this evening
Amit Shah – Jr.NTR Meeting : తెలంగాణ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ బీజేపీ నిర్వహించే ఆత్మగౌరవ సభకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. అయితే రాజకీయ సభ కోసం రానున్న అమిత్ షా తన పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ని కలవనున్నారు. అమిత్ షా నేడు ఆదివారం రాత్రి నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అవ్వనున్నారు. దీంతో అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
అయితే ఈ భేటీని రెండురకాలుగా అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ RRR సినిమాతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవలే అమిత్ షా RRR సినిమా చూశారని, అందులో ఎన్టీఆర్ నటనకి ఫిదా అయ్యారని, అందుకే తెలంగాణ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ ని కలవనున్నట్లు సమాచారం. అయితే RRR సినిమాని నిజంగానే అభినందించాల్సి వస్తే ఎన్టీఆర్ తో పాటు చరణ్, రాజమౌళిని కూడా కలిసే అవకాశం ఉంటుంది. మరి వారితో కాకూండా కేవలం ఎన్టీఆర్ తోనే ఎందుకు భేటీ అవ్వనున్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది.
Amit Shah: నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మునుగోడు సభకు హాజరు.. షెడ్యూల్ ఇదే..
ఇక కొంతమంది దీనిని రాజకీయ సమావేశంగా భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ ఎన్టీఆర్ ఇమేజ్ ని తెలంగాణలో వాడుకోవాలని బీజేపీ చూస్తుందని, అందుకే ఇటీవల RRR రచయిత విజయేంద్రప్రసాద్ కి రాజ్యసభ ఎంపీ సీటు కూడా ఇచ్చారని అంటున్నారు. అమిత్ షా ఎన్టీఆర్ ని మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు కలుస్తున్నారో కారణం ఇంకా ఎవ్వరికి తెలియకపోవడంతో సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది. సినీ, రాజకీయ వర్గాలతో పాటు ఎన్టీఆర్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు కూడా ఈ భేటీపై ఆసక్తి చూపిస్తున్నారు.