వ‌ల‌స కార్మికుల కోసం ప్రత్యేక ఫ్లైట్స్ ఏర్పాటు చేసిన అమితాబ్

  • Published By: dharani ,Published On : June 11, 2020 / 01:13 AM IST
వ‌ల‌స కార్మికుల కోసం ప్రత్యేక ఫ్లైట్స్ ఏర్పాటు చేసిన అమితాబ్

లాక్‌డౌన్‌ కారణంగా ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులను తమ సొంత ఊర్లకు తరలించి.. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.     వారికోసం ప్రత్యేకంగా నాలుగు విమానాలను ఏర్పాటు చేశారు. నిన్న ముంబై విమానాశ్రయం నుంచి ఆ నాలుగు విమానాల్లో 700కు పైగా వలస కార్మికులను తరలించారు.  

అలహాబాద్‌, గోరఖ్‌పూర్‌, వారణాసికి ఈ ప్రత్యేక విమానాలు నడిచినట్టు వెల్లడించారు. అంతేకాదు ఈ రోజు (జూన్ 11, 2020) మరో రెండు ప్రత్యేక విమానాల్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.  వలస కార్మికుల తరలింపు కోసం అమితాబ్‌ బచ్చన్‌ ఇటీవల పది ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. 

అసలైతే వలస కార్మికులను రైళ్ళ‌ల్లో పంపాలని నిర్నయించుకున్నారు. కానీ, కొన్ని సమస్యల వల్ల అది కుదరకపోవడంతో.. ప్ర‌త్యేక ఫ్లైట్స్ ద్వారా వారిని సొంత ఊర్లకు పంపారు. ఈ విష‌యాన్ని అమితాబ్ ఎక్క‌డ చెప్పుకోక‌పోయిన‌ప్ప‌టికీ వార్త మీడియాకి తెలిసిపోయింది. అనంతరం మీడియా అమితాబ్ చేస్తున్న సేవ‌ల‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు.

Read: నాగార్జున చార్టెట్ విమానం కొంటున్నారా?