Amitabh Bachchan : అమితాబ్ బ‌చ్చ‌న్‌కు ఎవ‌రంటే భ‌య‌మో తెలుసా..? అందుకే దాని గురించి ఎక్కువగా మాట్లాడ‌రట‌!

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ త‌న భార్య జ‌యా బ‌చ్చ‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Amitabh Bachchan : అమితాబ్ బ‌చ్చ‌న్‌కు ఎవ‌రంటే భ‌య‌మో తెలుసా..? అందుకే దాని గురించి ఎక్కువగా మాట్లాడ‌రట‌!

Amitabh Bachchan-Jaya Bachchan

Updated On : October 7, 2023 / 5:41 PM IST

Amitabh Bachchan-Jaya Bachchan : బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ త‌న భార్య జ‌యా బ‌చ్చ‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న ప‌ట్ల ఆమె ఎంత క‌ఠినంగా ఉంటుందో చెప్పారు. అందుక‌నే ఆమె అంటే త‌న‌కు భ‌య‌మ‌ని ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో అమితాబ్ వెల్లడించారు.

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. విజ‌య‌వంతంగా 14 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం 15వ సీజ‌న్ న‌డుస్తోంది. ఈ షోకు హోస్ట్‌గా అమితాబ్ బ‌చ్చ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సీజ‌న్‌లో 40వ ఎపిసోడ్ ప్ర‌సార‌మైంది. ఈ ఎసిసోడ్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని సింగా నుంచి వ‌చ్చిన‌ జయ పటేల్‌ను హాట్ సీట్‌కి స్వాగతించారు అమితాబ్‌. అనంత‌రం ఆమెను ఉద్దేశించి.. ‘మీరు టీచ‌ర్ క‌దా..? మీరు ఎలా ఉంటారు..? స్ట్రిక్ట్‌గానా లేక స‌ర‌దాగా ఉంటారా..?’ అని అమితాబ్ ప్ర‌శ్నించారు.

Also Read : చిరంజీవి ఇంద్ర వీణ స్టెప్ కాపీ కొట్టిన తమిళ్ హీరో విజయ్.. ఈ సాంగ్ చూశారా?

‘నేను పాఠాలు చెప్పేట‌ప్పుడు చాలా క‌ఠినంగా ఉంటాను సార్‌. అయితే.. నాకు రెండు పేర్లు ఉన్నాయి. జూహీ, జయ. నేను జయగా ఉన్నప్పుడు నేను కఠినంగా ఉంటాను. నేను జూహీగా ఉన్నప్పుడు సాధార‌ణంగా కూల్‌గా ఉంటాను’ అని చెప్పారు. అనంత‌రం అమితాబ్‌ను ఆమె ఓ ప్ర‌శ్న అడిగింది. జ‌య అనే పేరుతో మీ అనుభ‌వం ఎలా ఉంది..? అని అమితాబ్ భార్య జ‌యా బ‌చ్చ‌న్ ను ఉద్దేశిస్తూ అడిగారు.

జ‌యా బ‌చ్చ‌న్ త‌న ప‌ట్ల‌ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంద‌ని చెప్పారు. అంతేకాదు ద‌య‌గా కూడా ఉంటున్నారు. ‘ఇలాంటి ప్ర‌శ్న‌ల‌ను మీరు ఎందుకు అడుగుతారు. ఆమెతో క‌లిసి ఈ షోను నేను చూడాలి. అప్పుడు నాకు ఉంటుంది. ఆ సీన్ త‌ల‌చుకుంటేనే నాకు వెన్నులో వ‌ణుకు వ‌స్తోంది. అందుకే నేను నా వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఎక్కువ‌గా మాట్లాడ‌ను’ అంటూ అమితాబ్ బ‌చ్చ‌న్ స‌ర‌దాగా అన్నారు. ప్ర‌స్తుతం అమితాబ్ చేసిన ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.

Also Read : వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన మెగాస్టార్..