1000 Wala Movie : ‘1000 వాలా’ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Amith 1000 Wala Movie Release Date Announced
1000 Wala Movie : సూపర్ హిట్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై షారుఖ్ నిర్మాణంలో అఫ్జల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 1000 వాలా. అమిత్ అనే నూతన నటుడు ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అమిత్, షారుఖ్, నమిత, కీర్తి, సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. 1000 వాలా సినిమా మార్చ్ 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా హీరో అమిత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమ అనేది అందరి జీవితంలో ఓ ప్రత్యేకమైన అనుభూతి. మా సినిమా 1000 వాలా ప్రేమ, అనుభూతి, యాక్షన్, ఎమోషన్‌లతో మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. మా సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చ్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. హీరో కావాలనే నా కలను నిజం చేసిన మా నిర్మాత షారుఖ్ కు ధన్యవాదాలు అని అన్నారు.
నిర్మాత షారుఖ్ మాట్లాడుతూ.. మా 1000 వాలా సినిమా కమర్షియల్ కథతో తీసాం. సుమారు 150 థియేటర్లలో సినిమాని గ్రాండ్ గా మార్చ్ 14న రిలీజ్ చేయబోతున్నాం అని తెలిపాడు.