1000 Wala Movie : 1000 వాలా.. త్వరలోనే రిలీజ్.. భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్..
ప్రస్తుతం 1000 వాలా సినిమా షూట్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Amith 1000 Wala Movie Releasing Soon Post Productions Completed
1000 Wala Movie : సూపర్ హిట్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై షారుఖ్ నిర్మాణంలో అఫ్జల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 1000 వాలా. ఈ సినిమాతో నూతన నటుడు అమిత్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అమిత్, షారుఖ్, నమిత, కీర్తి, సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ అఫ్జల్ గతంలో టెన్ రూపీస్ అనే ఓ కొత్త కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
Also Read : Aha OTT : ఆహా ఓటీటీలో సరికొత్త రొమాంటిక్ కామెడీ క్రైమ్ సినిమా.. మలయాళం డబ్బింగ్..
ప్రస్తుతం 1000 వాలా సినిమా షూట్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసి దర్శక నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. మా 1000 వాలా సినిమా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నాం. ఈ సినిమా హిట్ అవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం అని ప్రకటించారు.