ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ షూటింగ్ కంప్లీట్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ‘దొరసాని’ అనే చిత్రం తో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. తెలంగాణ నేపథ్యంలో ఎమోషనల్ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రకరణ పూర్తయ్యింది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతున్నారు. ఒకే సినిమాతో ఇద్దరు స్టార్ వారసులు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.