Anandhi : వామ్మో.. క్లాస్ హీరోయిన్ ఇంత మాస్ గా మారిపోయింది.. ‘శివంగి’ కోసం..

తాజాగా ఈ సినిమా నుంచి ఆనంది పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని బ్లాక్ బస్టర్ డెరైక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసారు.

Anandhi : వామ్మో.. క్లాస్ హీరోయిన్ ఇంత మాస్ గా మారిపోయింది.. ‘శివంగి’ కోసం..

Anandhu Turned into Mass Look for Shivangi Movie First Look Released by Anil Ravipudi

Updated On : February 20, 2025 / 9:28 AM IST

Anandhi : తెలుగమ్మాయి ఆనంది తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆనంది ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని క్లాస్, క్యూట్ పాత్రలతోనే మెప్పించింది. కానీ ఇప్పుడు ఓ మాస్ పాత్రతో రాబోతుంది.

Also Read : Manisharma : మెగాస్టార్ పై అభిమానంతో మరోసారి రక్తదానం చేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..

ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు నిర్మిస్తున్న సినిమా శివంగి. పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆనంది పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని బ్లాక్ బస్టర్ డెరైక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసారు.

Anandhu Turned into Mass Look for Shivangi Movie First Look Released by Anil Ravipudi

ఈ పోస్టర్ లో ఆనంది నల్ల లుంగీ, చొక్కాతో కాలు పై కాలు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని సోఫాలో డైనమిక్ గా మాస్ లుక్ తో కూర్చుంది ఆనంది. దీంతో ఇన్నాళ్లు క్లాస్ గా, క్యూట్ గా కనిపించిన ఆనంది ఈ రేంజ్ లో మారిపోయింది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఆనంది లుక్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Allu Arjun – Dhanaraj : అల్లు అర్జున్ గారిని ఆ రోజు కాల్ చేయమని చెప్పాను.. గుర్తుంచుకొని మరీ కాల్ చేసి..

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మార్చి 7న ఈ శివంగి సినిమా రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు.