Anchor Rashmi : ఒక్క ఫోటో పెడితే చాలు సొల్లు కార్చుకుంటారు.. నెటిజన్‌కి కౌంటర్ ఇచ్చిన యాంకర్ రష్మీ

సోషల్ మీడియాలో ఎవరైనా రష్మికి కౌంటర్లు ఇస్తే అప్పుడప్పుడు వాటికి ధీటుగా జవాబిస్తుంది.

Anchor Rashmi : ఒక్క ఫోటో పెడితే చాలు సొల్లు కార్చుకుంటారు.. నెటిజన్‌కి కౌంటర్ ఇచ్చిన యాంకర్ రష్మీ

Anchor Rashmi Strong Counter to Netizen Tweet goes Viral

Updated On : March 23, 2024 / 5:25 PM IST

Anchor Rashmi : నటిగా, యాంకర్ గా రష్మీRashmi Gautam) బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు, పలు సినిమాలో అడపాదడపా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సొసైటీలో జరిగే వాటి గురించి స్పందిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరైనా రష్మికి కౌంటర్లు ఇస్తే అప్పుడప్పుడు వాటికి ధీటుగా జవాబిస్తుంది.

ఇటీవల జొమోటో గ్రీన్ డ్రెస్ మీద స్పందిస్తూ రష్మిక ఓ పోస్ట్ చేసింది. వెజిటేరియన్ కి గ్రీన్ డ్రెస్ పెడితే, సపరేట్ ఆప్షన్ పెడితే తప్పేంటి అంటూ జొమోటో నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేయడంతో ఓ నెటిజన్.. ఇలాంటి పోస్టులన్నీ రీచ్ కోసమే, అటెన్షన్ కోసం కదా అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి యాంకర్ రష్మీ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది.

Also Read : They Call Him OG : ఎన్నికల హడావిడిలో పవన్ కళ్యాణ్.. OG సినిమా వర్క్‌లో బిజీగా డైరెక్టర్..

రష్మీ రిప్లై ఇస్తూ.. రీచ్ కోసమైతే నేను ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోటో చాలు జూమ్ చేసీ మరీ సొల్లు కారుస్తూ అవసరం లేని అటెన్షన్ ఇస్తారు. నాకు తెలిసి నీకైతే అటెన్షన్ దొరికింది అనుకుంట కదా. ఈ అటెన్షన్ కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురుచూసావో అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో రష్మీ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది. ఆ నెటిజన్ కి గట్టి కౌంటర్ పడింది అని కామెంట్స్ చేస్తున్నారు.