Roshan Kanakala : మీరు డివోర్స్ తీసుకుంటున్నారా ? అని నాన్నని డైరెక్ట్‌గా అడిగిన రోషన్ కనకాల

యాంకర్ సుమ, నటుడు రాజీవ్‌ల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన రోషన్ తన పేరెంట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Roshan Kanakala : మీరు డివోర్స్ తీసుకుంటున్నారా ? అని నాన్నని డైరెక్ట్‌గా అడిగిన రోషన్ కనకాల

Roshan Kanakala

Roshan Kanakala : ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ‘బబుల్ గమ్’ అనే మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా రోషన్ మీడియాతో తన పేరెంట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

కొన్ని దశాబ్దాలుగా యాంకర్ సుమ తన ప్రొఫెషన్‌లో నాన్ స్టాప్‌గా దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా సుమ కనిపిస్తారు. సుమ భర్త నటుడు రాజీవ్ కనకాల కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఈ జంట వారసుడు రోషన్ ‘బబుల్ గమ్’ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అవుతున్నారు. నిర్మలా కాన్వెంట్ సినిమాలో నటించిన రోషన్‌కి హీరోగా బబుల్ గమ్ మొదటి సినిమా. ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోషన్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Nayanthara : సూపర్ స్టార్ బిరుదుపై వివాదం.. స్పందించిన నయనతార..

తన తల్లిదండ్రుల నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలన్నారు రోషన్. తన తల్లి ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఇప్పుడు తనకు తెలుస్తోందని చెప్పారు. తన తల్లి సుమ ఎంత హార్డ్ వర్కర్ అనేది ఇప్పుడు తనకు అర్ధమవుతోందన్నారు రోషన్.  ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు షూటింగ్స్ చేసి ఇంటికి వచ్చి తమ బాధ్యతలు చూసుకునే వారని.. ఎప్పుడు మాకు టైమ్ ఇవ్వలేదు అనే అవకాశం మాకు ఇవ్వకుండా చూసుకున్నారని రోషన్ అన్నారు. తండ్రి రాజీవ్ యాక్టింగ్‌కి సంబంధించి డౌట్స్ ఉంటే చెబుతారని అన్నారు.

తన తల్లిదండ్రులు డివోర్స్ తీసుకుంటున్నారని వచ్చిన అంశంపై రోషన్ మాట్లాడారు. తన ఎదురుగా ఎప్పుడూ ఇద్దరు సంతోషంగా కనిపించేవారని .. మీడియాలో వారిద్దరి డివోర్స్ వార్తలు చదువుతుంటే ఆశ్చర్యం అనిపించేదని అన్నారు రోషన్. ఒకసారి తండ్రిని ఇదే విషయంపై ప్రశ్నించానని మీడియాలో అలాగే రాస్తుంటారు అవేం పట్టించుకోవద్దని చెప్పారని రోషన్ చెప్పారు. ఇక తను 5 క్లాసులో ఉన్నప్పుడు ఓ అమ్మాయి అందంగా ఉండేదని.. తనను చూస్తు ఉండిపోయేవాడినని అది లవ్ అనుకున్నానని.. ఆ తర్వాత ఆ అమ్మాయి వేరే స్కూల్ కి వెళ్లిపోయిందని తన చిన్ననాటి లవ్ స్టోరీ గుర్తు చేసుకున్నారు రోషన్.

Renu Desai : రేణు దేశాయ్ పుట్టిన రోజుకి కొడుకు అకిరా నందన్ ఏం గిఫ్ట్ ఇచ్చారో చూశారా?

కాగా రోషన్ ‘బబుల్ గమ్’ సినిమా డిసెంబర్ 29 థియేటర్లలోకి వస్తోంది. రవికాంత్ పేరేపు డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీకిలో మనసా చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.