Anita Hassanandani : బాబును చూస్తూ కంటతడి పెట్టిన ‘నువ్వు నేను’ అనిత..

అమ్మతనంలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ భావేద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.. ‘నువ్వు నేను’ సినిమాతో ప్రేక్షకులకు ఆకట్టుకుని, తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిత..

Anita Hassanandani : బాబును చూస్తూ కంటతడి పెట్టిన ‘నువ్వు నేను’ అనిత..

Anita Hassanandani Shares Her Son Aaravv Video

Updated On : June 29, 2021 / 4:20 PM IST

Anita Hassanandani: ఢిల్లీకి రాజు అయినా తల్లికి బిడ్డే అనే నానుడి గుర్తుండే ఉంటుంది. ఈ సృష్టిలో, మనిషి జీవితంలో మధురమైనది, వెలకట్టలేనిది ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ ఒక్కటే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మతనంలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ భావేద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.. ‘నువ్వు నేను’ సినిమాతో ప్రేక్షకులకు ఆకట్టుకుని తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిత..

Anita Hassanandani

ఈ ఏడాది ఫిబ్రవరి 9న అనిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. రీసెంట్‌గా ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారామె. బాబు హాయిగా నిద్రపోతుండగా.. అనిత బాబును ఆప్యాయంగా చూస్తూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా ఉంది..

Anita

2013లో బిజినెస్‌మెన్ రోహిత్ రెడ్డిని అనిత వివాహం చేసుకున్నారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత తొలి సంతానానికి జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన అనిత బాలీవుడ్‌లో ‘నాగిని’ సీరియల్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anita Hassanandani (@anitahassanandani_x)