Anni manchi sakunamule : ఓటీటీలోకి వచ్చేసిన ‘అన్నీ మంచి శకునములే’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్.. దేనిలో అంటే..?
యువ హీరో సంతోష్ శోభన్( Santosh Soban) నటించిన చిత్రం అన్నీ మంచి శకునములే. నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవికా నాయర్(Malvika Nair) హీరోయిన్.

Anni Manchi Sakunamule
Anni manchi sakunamule OTT : యువ హీరో సంతోష్ శోభన్( Santosh Soban) నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవికా నాయర్(Malvika Nair) హీరోయిన్. స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ బ్యానర్స్ పై ఈ సినిమాని నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించగా షావుకారు జానకి, రాజేంద్రప్రసాద్, గౌతమి, రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్, వాసుకి, రమ్య సుబ్రమణియన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పర్వాలేదనిపించే సక్సెస్‌ను సొంతం చేసుకుంది.
థియేటర్స్‌లో కొందరు ఈ చిత్రాన్ని మిస్ అయ్యారు. అలాంటి వారికి చిత్ర బృందం శుభవార్త చెప్పింది. నేటి(జూన్ 17) నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకురాలు నందిని రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
View this post on Instagram
కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే చిత్రం. మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి లివింగ్ రూమ్‌లో కూర్చోని హాయిగా విశ్రాంతి తీసుకుంటూ అన్నీ మంచి శకునములే చిత్రాన్ని చూడండి. ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమా కామెడీతో చక్కిలిగింతలు పెడుతుంది, అందమైన ప్రకృతి దృశ్యంతో మిమ్మల్ని ఆకర్షిస్తుంది, భావోద్వేగంతో కన్నీటిని తుడుచుకునేలా చేస్తుంది అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Mahesh Babu : ఇంగ్లాండ్ దంచుడుకు మహేశ్ బాబు ఫిదా.. నవశకానికి నిదర్శనం అంటూ..
కాగా.. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్‌కు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. ఓటీటీలో ఈ చిత్రం అభిమానులను మెప్పిస్తుందో లేదో చూడాల్సిందే.