Anupama Parameswaran : రొమాన్స్ చేయడం చాలా కష్టం.. చూసేవాళ్ళకి మేమేదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు..

రాబోయే టిల్లు స్క్వేర్ సినిమాలో మరింత డోసు పెంచి ముద్దులతో, రొమాన్స్ తో రెచ్చిపోతుంది అనుపమ పరమేశ్వరన్.

Anupama Parameswaran : రొమాన్స్ చేయడం చాలా కష్టం.. చూసేవాళ్ళకి మేమేదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు..

Anupama Parameswaran Comments on Intimacy Scenes in Tillu Square Movie

Updated On : March 26, 2024 / 6:50 AM IST

Anupama Parameswaran : ఇన్నాళ్లు హీరోయిన్ గా క్యూట్ పాత్రలతో మెప్పించిన అనుపమ పరమేశ్వరన్ రౌడీ బాయ్స్ సినిమా నుంచి హాట్ పాత్రలతో కూడా మెప్పిస్తుంది. త్వరలో రాబోయే టిల్లు స్క్వేర్(Tillu Square) సినిమాలో మరింత డోసు పెంచి ముద్దులతో, రొమాన్స్ తో రెచ్చిపోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ తోనే అనుపమ తన హాట్ నెస్ తో అదరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇవన్నీ చూసి సినిమాలో ఇంకే రేంజ్ లో చేసిందో అనుకుంటున్నారు.

టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న రిలీజ్ కాబోతుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక ప్రమోషన్స్ లో అనుపమ ఎక్కడికి వెళ్లినా ముందు ఈ రొమాన్స్ గురించే ప్రశ్నిస్తున్నారు. ఆల్రెడీ గతంలో ఓ ప్రెస్ మీట్ లో రోజూ రెగ్యులర్ క్యారెక్టర్స్ చేసి బోర్ కొట్టేసింది, ఈ పాత్ర నాకు నచ్చింది, ఇలాంటివి కూడా చేయాలి, అందుకే చేశాను అని తెలిపింది.

Also Read : Takashi Yamazaki : ఆస్కార్ విన్నింగ్ ‘ఓపెన్ హైమర్’ సినిమాకు కౌంటర్ సినిమా తీస్తానంటున్న జపాన్ స్టార్ డైరెక్టర్

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే రొమాంటిక్ సీన్స్ గురించి ప్రశ్నించడంతో అనుపమ మాట్లాడుతూ.. రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఇద్దరు ఇంటిమెంట్ గా ఉన్నది ప్రైవేట్ మూమెంట్. కానీ 100 మంది చుట్టూ ఉండగా, సెట్ యూనిట్ ముందు సీన్ చేయడం అంటే చాలా కష్టం. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందరూ సినిమాలో కార్ సీన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో నేను చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. దాంట్లోంచి బయటకి రావడం చాలా కష్టం. అయినా అలాంటి పరిస్థితుల్లో మనం బాగా యాక్ట్ చేయాలి, రొమాన్స్ ఎంజాయ్ చేసినట్టు నటించాలి, సీన్ ని పండించాలి, ఆడియన్స్ ని మెప్పించాలి. అది అంత ఈజీ కాదు. చూసిన వాళ్ళు అంతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు, అది కరెక్ట్ కాదు అని తెలిపింది. దీంతో రొమాన్స్ సీన్స్ షూట్ చేసేటప్పుడు నటీనటులు ఎంత ఇబ్బందిపడతారో చెప్పింది అనుపమ.