ప్రభాస్ సాహోకి సీఎం జగన్ షాక్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల ధరల పెంపు గురించి వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ వర్గాలు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల ధరల పెంపు గురించి వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ వర్గాలు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల ధరల పెంపు గురించి వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. సాహో సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశాయి. టికెట్ల ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అధికారులు వివరించారు. ఒక్కో సినిమా విషయంలో ఒక్కోలా వ్యవహరించలేము అని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. విధానం ఏదైనా అన్ని సినిమాలకు ఒకేలా ఉంటుందన్నారు. ఎవరి సినిమా అయినా ప్రభుత్వానికి సమానమే అని తేల్చి చెప్పారు.
ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన మోస్ట్ అవైటెడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్.. సాహో. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని వార్తలొచ్చాయి. తొలి వారం రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి వచ్చిందని చెప్పారు. కట్ చేస్తే.. అలాంటిదేమీ లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధరలు, అదనపు షో లు వేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. సాహో సినిమా నిర్మాతల రిర్వెస్ట్ ని సున్నితంగా తిరస్కరించింది.
ఇది ఇలా ఉంటే.. సాహో సినిమా టికెట్ల ధర పెంపు వ్యవహారం హైకోర్టుకి చేరింది. సాహో సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని నిర్మాత నట్టికుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలని ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, విశాఖ పోలీసు కమిషనర్, సాహో చిత్ర పంపిణీదారు దిల్ రాజు తదితరులకు నోటీసులు జారీచేసింది. సాహో టికెట్ల ధరలను రూ.100, రూ.200, రూ.300లుగా నిర్ణయించి, వసూలుకు సిద్ధమైనవారి ప్రయత్నాలను అడ్డుకోవాలని నిర్మాత నట్టికుమార్ కోరారు. దీనిపై మంగళవారం(ఆగస్టు 27,2019) జస్టిస్ జి.శ్యాంప్రసాద్ విచారించారు. సాహో సినిమా టికెట్ల ధరలు పెంచకుండా ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు.
ఆగస్టు 30న సాహో ఇండియా వైడ్ 10 వేల స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఏపీ, తెలంగాణాలో 2 వేల స్క్రీన్స్‌లో రిలీజ్ అవనుంది. బాలీవుడ్‌తో పాటు మిగతా చోట్ల కూడా అత్యధిక ధియేటర్స్ సాహోకే కేటాయించారు. బాహుబలి : ది కన్‌క్లూజన్ 9 వేల స్క్రీన్స్‌లో రిలీజ్ అవ్వగా సాహో అదనంగా మరో వెయ్యి థియేటర్లలో విడుదల అవుతుండటం విశేషం. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో సాహో గ్రాండ్‌గా విడుదల కానుంది.
టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, అదనపు షో లు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని ‘సాహో’ నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారని, అందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. తొలివారం ‘సాహో’ను ప్రదర్శించే థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ రేటు డబుల్ అవుతుందని చెప్పారు. అంటే.. ప్రస్తుతం ఉన్న రూ.100 టికెట్.. రూ.200 అవుతుంది. అయితే ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని ప్రభుత్వం స్పష్టం చెయ్యడం విశేషం. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు తొలి వారంలో టిక్కెట్ రేట్లను పెంచడం.. దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గతంలో పలుమార్లు జరిగింది. ఇలా పెరిగిన రేట్లు నిర్మాతలకు లాభాలను తెస్తే.. సగటు ప్రేక్షకుడి జేబుకి చిల్లు పెడుతున్నాయి. టికెట్ ధరలు పెంచుకోవడానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.