Kaikala Satyanarayana : విషమంగానే కైకాల సత్యానారాయణ ఆరోగ్యం

టాలీవుడ్ సీనియర్ నటుడు, నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు.

Kaikala Satyanarayana : విషమంగానే కైకాల సత్యానారాయణ ఆరోగ్యం

Satyanarayana

Updated On : November 21, 2021 / 9:10 PM IST

Kaikala Satyanarayana health bulletin : టాలీవుడ్ సీనియర్ నటుడు, నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నారని పేర్కొన్నారు. నిన్న ఉదయం 7.30 గంటలకు కైకాల సత్యనారాయణ తీవ్ర జ్వరం, శ్వాస ఇబ్బందితో అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది.

గత నెల 30న కూడా ఒకసారి కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా తిరిగి కోలుకున్నారు. అంతకు ముందు కూడా కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని తన నివాసంలో కాలు జారిపడగా.. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే తిరిగి కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. గత 60 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ లో కైకాల సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రలకు జీవం పోసి అలరించి నటసార్వభౌముడిగా కీర్తి గడించారు.

Heavy Rains : ఏపీపై వరుణుడి ప్రతాపం..24 మంది మృతి..జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు

ఆదివారం ఉదయం కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ఐసియులో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ గారు స్పృహలోకి వచ్చారని తెలిసి ఫోన్‌లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది.

ట్రాకియాస్టోమి కారణంగా మాట్లాడలేక పోయినా మళ్లీ త్వరలో ఇంటికి తిరిగి రావాలని, ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు థంబ్స్ అప్ సైగ చేసి, థాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు చెప్పారు.

Rayala Pond : రాయల చెరువు నుంచి లీకవుతున్న నీరు..కట్ట తెగితే 100 గ్రామాలకు ముప్పు

ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా ఇంటికి రావాలని ప్రార్ధిస్తున్నాను. ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితోనూ ఈ విషయం పంచుకోవటం ఎంతో సంతోషంగా వుంది’.. అని చిరు ట్వీట్ చేశారు.