Arjun Sarja : ఆ గుడికి రావాలంటూ మోదీకి అర్జున్ సజ్జా రిక్వెస్ట్.. ఏంటి ఆ గుడి..? ఎక్కడుంది..?

నటుడు అర్జున్ సర్జా ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. ఈ సందర్భంలో ఒక ఆలయానికి మోదీని రమ్మని ఆహ్వానించారు. ఏ ఆలయం? ఎక్కడ ఉంది?

Arjun Sarja : ఆ గుడికి రావాలంటూ మోదీకి అర్జున్ సజ్జా రిక్వెస్ట్.. ఏంటి ఆ గుడి..? ఎక్కడుంది..?

Arjun Sarja

Updated On : January 21, 2024 / 5:07 PM IST

Arjun Sarja : నటుడు అర్జున్ సజ్జా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జెంటిల్‌మన్‌’ తో మంచి గుర్తింపు పొందారు.  అంతకుముందు చాలానే తెలుగు సినిమాల్లో నటించారు. రీసెంట్‌గా అర్జున్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ranbir – Alia : అలియా ఎంకరేజ్ వల్లే.. ‘యానిమల్’లో ఇంటిమేట్ సీన్స్ చేశా.. రణబీర్ కామెంట్స్

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కుమార్తె ఐశ్వర్యతో కలిసి వెళ్లిన నటుడు అర్జున్ ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలిసి జ్ఞాపికను అందించారు. చెన్నైలో తాను నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని అర్జున్ మోదీని కోరారు. అందుకు మోదీ వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Salaar : సలార్ మొత్తంలో ప్రభాస్ మాట్లాడిన డైలాగ్స్ వీడియో.. కేవలం రెండున్నర నిమిషాలేనా..!

అర్జున్ సజ్జా టాలీవుడ్‌లో చాలానే సినిమాలు చేసారు. మా పల్లెలో గోపాలుడు, మన్నెం మొనగాడు, మావూరి మహారాజు, జెంటిల్‌మన్,శ్రీ మంజునాథ, పుట్టింటికి రా చెల్లి, శ్రీఆంజనేయం వంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే అర్జున్ సజ్జాకు ఆధ్మాత్మిక అంశాలపై ఆసక్తి ఎక్కువ. గతంలో టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన ‘శ్రీఆంజనేయం’ సినిమాలో అర్జున్ హనుమాన్ పాత్రలో నటించారు. ఆ తర్వాతనే ఆయనకు ఆంజనేయస్వామి గుడి కట్టాలనే కోరిక కలిగిందట. దాదాపుగా 17 సంవత్సరాల పాటు కష్టపడి అర్జున్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి సమీపంలో హనుమాన్ ఆలయాన్ని నిర్మించారు. 140 టన్నుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసారు. అర్జున్ సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని నిర్మించారట. ఈ ఆలయానికే మోదీని ఆహ్వానించారు అర్జున్ సజ్జా. తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ కాంబోలో ఇటీవల విడుదలైన ‘హనుమాన్’ కి దేశ వ్యాప్తంగా పేరొచ్చింది. ఈ నేపథ్యంలో అర్జున్ గతంలో నటించిన ‘శ్రీఆంజనేయం’ సినిమా వైరల్ కావడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Arjun Sarja (@arjunsarjaa)