Ashu Reddy : నా బాడీ సూపర్ డీలక్స్ అంటున్న బిగ్‌బాస్ భామ అషు రెడ్డి
సోషల్ మీడియా స్టార్ గా పేరు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 3లో మరింత గుర్తింపు సంపాదించుకున్న చిన్నది అషు రెడ్డి.

Ashu Reddy first look from Yevam release
Ashu Reddy – Yevam : సోషల్ మీడియా స్టార్ గా పేరు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 3లో మరింత గుర్తింపు సంపాదించుకున్న చిన్నది అషు రెడ్డి. పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో మయా క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో పలు సినిమాల్లో కూడా నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్‌హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది.
హీరోయిన్ చాందిని చౌదరి, వశిష్ఠ సింహ, జై భారత్ ,అషురెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యేవం’. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కీర్తన శేషు సంగీతాన్ని అందిస్తోండగా నవదీప్, గోపరాజు లు నిర్మిస్తున్నారు. ఇటీవల చాందిని చౌదరి ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
#AshuReddy as Ravishing Harika from the world of #Yevam ? pic.twitter.com/MhCWLRs2ih
— Vamsi Kaka (@vamsikaka) May 3, 2024
తాజాగా ఈ మూవీ నుంచి అషు రెడ్డి లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో హారిక అనే పాత్రలో అషు కనిపించనుంది. పోస్టర్‌లో ఓ చైర్‌లో కాలుమీద కాలేసుకుని అషురెడ్డి కూర్చోంది. ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అనే కాప్షన్ ను ఉంచారు. చూస్తుంటూ ఈ మూవీలో అషు రెడ్డి బోల్డ్‌గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది.