RGV – Ashu Reddy : ఆర్జీవీతో ఇంటర్వ్యూ.. నా జీవితంలో నేను చేసిన తప్పు.. మా పేరెంట్స్ బాగా ఇబ్బంది పడ్డారు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అషు రెడ్డి ఆర్జీవీతో ఇంటర్వ్యూ గురించి, ఆ తర్వాత తాను ఫేస్ చేసిన ఇబ్బందుల గురించి తెలిపింది.

Ashu Reddy Sensational Comments on Interview with RGV
RGV – Ashu Reddy : ఓ రెండేళ్ల క్రితం అషురెడ్డి ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీ కొన్ని స్పెషల్ ఇంటర్వ్యూ లు చేసాడు. ఈ క్రమంలో అషు రెడ్డితో ఓ ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవీ అషు రెడ్డి కాళ్ళు పట్టుకోవడం, ఆమె పాదాలను ముద్దు పెట్టుకోవడం, ఆమె పాదాలను నాకడం వంటివి చేయడంతో ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది.
ఆ ఇంటర్వ్యూ తో అషు రెడ్డి కూడా బాగా పాపులర్ అయింది. అయితే ఆర్జీవీ పై విమర్శలు వస్తూనే ఉంటాయి, అయినా అవేమి పట్టించుకోకుండా తనకి నచ్చింది చేసుకుంటాడు. అయితే అషురెడ్డి ఆర్జీవీతో ఇంటర్వ్యూ ఒప్పుకోవడం, అలా చేయడంతో అంతా అషుని విమర్శించారు. అలాంటి ఇంటర్వ్యూ కి ఎందుకు ఒప్పుకున్నావు అని అషురెడ్డిని తిట్టారు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ ట్వీట్ వైరల్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అషు రెడ్డి ఆ ఇంటర్వ్యూ గురించి, ఆ తర్వాత తాను ఫేస్ చేసిన ఇబ్బందుల గురించి తెలిపింది. అషు రెడ్డి మాట్లాడుతూ.. డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ అంటే వెళ్ళాను. అలా చేస్తారని ఊహించలేదు. ఆ ఇంటర్వ్యూ తర్వాత నాపై విమర్శలు చాలా వచ్చాయి. వాటిని నేను ఫేస్ చేయగలను. నేను అసలు పట్టించుకోను కూడా. కానీ ఆ ఇంటర్వ్యూ తర్వాత మా పేరెంట్స్ తో అందరూ నెగిటివ్ గా మాట్లాడారు. అపార్ట్మెంట్ లో చుట్టుపక్కల అందరూ నా గురించి మీ అమ్మాయి ఇలా అని పేరెంట్స్ తో మాట్లాడేవాళ్ళు. దాని వల్ల మా పేరెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. నా జీవితంలో నేను చేసిన ఒక తప్పు అది. ఆ తర్వాత ఆలోచించుకున్నాను, ఇలాంటి దాని కోసమా నేను ఈ ఫీల్డ్ కి వచ్చింది అని ప్రశ్నించుకున్నాను. ఇంకోసారి అలా చేయను అని ఫిక్స్ అయి ఇంట్లో సారీ కూడా చెప్పాను అని తెలిపింది.
ఇక ఆర్జీవీతో ఇంకా టచ్ లో ఉన్నారా అని అడగ్గా.. ఇప్పుడు అయితే ఆర్జీవీతో మాట్లాడట్లేదు. వర్క్ విషయంలో అయితేనే మాట్లాడతాను. ఆ తర్వాత ఆయన ఓ ఈవెంట్ కి పిలిచినా వెళ్ళలేదు. నేనైతే కాల్ చేయను అని తెలిపింది అషు. దీంతో అషు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.