Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ ట్వీట్ వైరల్..
త్రివిక్రమ్ సినిమా కంటే ముందు అట్లీతో ఓ పాన్ ఇండియా కమర్షియల్ సినిమా తీస్తాడని అంటున్నారు.

Allu Arjun Next Movie Update by Producer Bunny Vas
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో భారీ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయి 1850 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 రికార్డులు కూడా బద్దలు కొట్టింది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. త్రివిక్రమ్ సినిమా మైథలాజి అని చెప్పడంతో దానిపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే త్రివిక్రమ్ సినిమా కంటే ముందు అట్లీతో ఓ పాన్ ఇండియా కమర్షియల్ సినిమా తీస్తాడని అంటున్నారు. ఇప్పటికే కథ కూడా ఓకే అయిపోయింది. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనుందని తెలుస్తుంది. తాజాగా నేడు అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. బన్నీ వాసు తన ట్విట్టర్ లో.. షాకింగ్ సర్ ప్రైజ్ కోసం ప్రిపేర్ అయి ఉండండి. ఏప్రిల్ 8న రానుంది అని పోస్ట్ చేసాడు.
ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు. దీంతో ఆ రోజు అల్లు అర్జున్ – అట్లీ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో భారీ కమర్షియల్ సినిమా అల్లు అర్జున్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
Be Prepared for the shocking surprise 🔥🔥
April 8th 🌟🌟
— Bunny Vas (@TheBunnyVas) April 6, 2025
ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూల్ రోల్ చేస్తాడని, ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటికీ సమాధానం ఏప్రిల్ 8న దొరుకుతుందా చూడాలి.