Shivam Bhaje : ‘శివమ్ భజే’ అంటున్న అశ్విన్ బాబు.. టాలీవుడ్‌లో మరో విజువల్ వండర్..

టాలీవుడ్‌లో మరో విజువల్ వండర్ రాబోతున్నట్లు తెలుస్తుంది. 'శివమ్ భజే' అంటున్న అశ్విన్ బాబు..

Shivam Bhaje : ‘శివమ్ భజే’ అంటున్న అశ్విన్ బాబు.. టాలీవుడ్‌లో మరో విజువల్ వండర్..

Ashwin Babu Digangana Suryavanshi new movie titled as Shivam Bhaje

Updated On : March 11, 2024 / 5:33 PM IST

Shivam Bhaje : టాలీవుడ్ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు.. గత ఏడాది ‘హిడింబ’ అనే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఓ విజువల్ థ్రిల్లర్ తో వచ్చి సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేడు తన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ ని అశ్విన్ తెలియజేసారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అశ్విన్ బాబు తన కొత్త సినిమాని తీసుకు రాబోతున్నారు.

అప్సర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాకి ‘శివమ్ భజే’ అనే టైటిల్ ని ఖరారు. అలాగే ఓ మూవీ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. హిమాలయాలు, శివుడు పేస్ తో కనిపిస్తున్న పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. సోషియో ఫాంటసీ నేపథ్యంతో ఈ మూవీ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. కాగా మూవీలో థ్రిల్లింగ్ విజువల్ సీన్స్ ఉండబోతున్నాయని మేకర్స్ చెప్పుకొస్తున్నారు.

Also read : Nitin Chandrakant Desai : ఆస్కార్ వేదికపై.. దివంగత ఇండియన్ ఆర్ట్ డైరెక్టర్‌ జ్ఞాపకాలు..

రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ‘గామి’ కూడా ఆడియన్స్ ని థ్రిల్లింగ్ విజువల్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇక ఈ పోస్టర్ అండ్ టైటిల్ ని చూసిన ఆడియన్స్.. టాలీవుడ్ లో మరో విజువల్ వండర్ రాబోతోందా అని అంచనాలు వేసుకుంటున్నారు. కాగా ఈ మూవీలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. వికాస్ బాడిస సంగీతం ఇస్తున్నారు.