Avatar 2: థియేటర్లలో అవతార్ 2 ఫస్ట్ గ్లిమ్ప్స్.. షో ఎప్పుడంటే?

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్‌’. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్‌ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక సరికొత్త ఊహా లోకంలో విహరించేలా చేసింది.

Avatar 2: థియేటర్లలో అవతార్ 2 ఫస్ట్ గ్లిమ్ప్స్.. షో ఎప్పుడంటే?

Avatar2

Updated On : May 3, 2022 / 6:59 PM IST

Avatar 2: హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్‌’. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్‌ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక సరికొత్త ఊహా లోకంలో విహరించేలా చేసింది. ఈ సినిమాలో పండోరా ప్రపంచంలో హీరో అక్కడ ఉన్న గుర్రాలను మచ్చిక చేసుకోవడం తన తోకను గుర్రం మైండ్‌తో మమేకం చేసి, హీరో ఆలోచనలకు తగ్గట్టుగా గుర్రం నడుచుకునే సన్నివేశాల ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచాయి. ఎన్నో అద్భుతాలు ఉన్న అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

Avatar 2: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వరల్డ్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ రిలీజ్!

దీంతో ఈ సినిమా సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘అవతార్ 2’ రానున్న సంగతి తెలిసిందే. డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కాబోతున్న అవ‌తార్ 2 ఇదివ‌ర‌కెన్న‌డూ లేని వీఎఫ్ఎక్స్ తో ప్రేక్ష‌కులకు అద్బుత‌మైన అనుభూతిని క‌లిగించేలా ఉండ‌నుంద‌ట‌. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 160 భాషల్లో విడుదల కాబోతుండగా.. అదే జరిగితే ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదే రికార్డ్ కానుందని ప్రపంచ మూవీ మేకర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Avatar 2: సకుటుంబ సపరివార సమేతంగా రానున్న అవతార్-2

కాగా, ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్ ని సినిమా కాన్ లో ప్రీమియర్ ప్రదర్శితం చేశారు. అలాగే మార్వెల్ స్టూడియో వారి ‘డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మేడ్ నెస్’ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో కూడా ప్రసారం చేయనున్నారట. మే 6వ తేదీన ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మేడ్ నెస్’ విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ‘అవతార్ 2’ ఫస్ట్ గ్లింప్స్ ను కూడా ప్రదర్శించబోతుండడంతో ఆడియెన్స్ ఇప్పుడు ఈ క్రేజీ గ్లిమ్ప్స్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.