Ayesha Takia: హీరోయిన్‌పై ఎయిర్‌పోర్ట్ అధికారుల లైంగిక వేధింపులు!

నాగార్జున-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన సూపర్ సినిమా గుర్తుందా.. అందులో అనుష్క తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడంతో పాటు బాలీవుడ్ హీరోయిన్ అయేషా..

Ayesha Takia: హీరోయిన్‌పై ఎయిర్‌పోర్ట్ అధికారుల లైంగిక వేధింపులు!

Ayesha Takia

Updated On : April 11, 2022 / 3:00 PM IST

Ayesha Takia: నాగార్జున-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన సూపర్ సినిమా గుర్తుందా.. అందులో అనుష్క తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడంతో పాటు బాలీవుడ్ హీరోయిన్ అయేషా టకియా కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటించని అయేషా.. బిజినెస్ మెన్ ఫర్హన్‌ అజ్మీని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చి ఫ్యామిలీ లైఫ్ ను గడిపేస్తుంది. కాగా.. ఇప్పుడు అయేషాను ఎయిర్ పోర్టులోనే అధికారులు లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె భర్త చేసిన ట్వీట్స్ ఒక్కసారిగా మళ్ళీ ఆమె తెరపైకి వచ్చింది.

Bollywood Couples: ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్.. ప్రేమకు వయసుతో పనేంటి?

అయేషా ఫ్యామిలీ గోవా నుంచి ముంబైకి వస్తుండగా ఎయిర్ పోర్టులో ఓ అధికారి అయేషాను అసభ్యంగా తాకాడని స్వయంగా ఆమె భర్త ఫర్హన్‌ అజ్మీ సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. ఎయిర్‌పోర్టులో ఆర్‌పీ‌సింగ్, ఏకే యాదవ్ అనే ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు నన్ను, నా కుటుంబాన్ని అడ్డగించి.. నా పేరు గట్టిగా పలుకుతూ వాళ్ల టీమ్ మెంబర్స్‌తో వెకిలిగా ప్రవర్తించారని.. సెక్యూరిటీ చెక్ కోసం లైన్‌లో నిలబడితే సెక్యూరిటీ డెస్క్‌లోని ఓ పురుష అధికారి నన్ను, నా ఫ్యామిలీని వేరువేరు లైన్‌లో నిలబడమని సూచిస్తూ ఆయేషా ఒంటిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ట్వీట్ చేశాడు.

Bollywood Couples: అలియా నుండి కరీనా వరకు.. మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజెస్!

ఒక మహిళలను టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం తాను అధికారిని అడిగానని.. దూరంగా ఉండాలని కోరానని.. తర్వాత మళ్లీ తనను తనిఖీ చేస్తున్నప్పుడు కూడా డర్టీగా సెక్సువల్ కామెంట్స్ చేశారని ట్వీట్స్ లో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి మాకు న్యాయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నా అంటూ ట్వీట్‌లో వివరించాడు. ఇది కాస్తా వైరల్‌ కావడంతో స్పందించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు.. ‘ప్రయాణంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయాన్ని విచారించి తగిన చర్యలు తీసుకుంటాం’ అని హామీ ఇచ్చారు.