Ayushmann Khurrana : బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి, ప్రముఖ జ్యోతిష్కుడు కన్నుమూత..

జ్యోతిష్య శాస్త్రంలో దేశవ్యాప్తంగా పి ఖురానా ఎంతో పేరు సంపాదించుకున్నారు. దేశంలోనే ప్రముఖ జ్యోతిష్కుడిగా గుర్తింపు పొందారు. గుండె జబ్బుతో ఇటీవల పంజాబ్ మొహాలీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరగా గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం నాడు కన్నుమూశారు.

Ayushmann Khurrana : బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి, ప్రముఖ జ్యోతిష్కుడు కన్నుమూత..

Ayushmann Khurrana father famous astrologer P Khurrana Passes away

Updated On : May 20, 2023 / 6:53 AM IST

P Khurrana :  ఇటీవల సినీ పరిశ్రమలో పలు వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ సెలబ్రిటీలు, సెలబ్రిటీల కుటుంబ సభ్యులు మరణిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana) తండ్రి, ప్రముఖ జ్యోతిష్కుడు పి ఖురానా కన్నుమూశారు.

జ్యోతిష్య శాస్త్రంలో దేశవ్యాప్తంగా పి ఖురానా ఎంతో పేరు సంపాదించుకున్నారు. దేశంలోనే ప్రముఖ జ్యోతిష్కుడిగా గుర్తింపు పొందారు. గుండె జబ్బుతో ఇటీవల పంజాబ్ మొహాలీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరగా గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం నాడు కన్నుమూశారు. అదే రోజు సాయంత్రం చండీఘడ్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

NTR Centenary Celebrations : హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. విజయవంతం చేయాలని పిలుపు

పి ఖురానాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ స్టార్ హీరో కాగా, అపరశక్తి ఖురానా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పి ఖురానాకు సంతాపం తెలుపుతున్నారు.