Ayyappanum Koshiyum : ఒరిజినల్ వర్షన్ సినిమాలోని క్యారెక్టర్లు ‘భీమ్లా నాయక్’లో ఎవరెవరు చేశారో చూడండి..
అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాని తెలుగులో 'భీమ్లా నాయక్' సినిమాగా తెరకెక్కించారు. బిజూ మీనన్, పృద్వి రాజ్ సుకుమారన్ మలయాళంలో లీడ్ రోల్స్ చేశారు. ఆ పాత్రలని ఇక్కడ పవన్, రానాలు........

2
Bheemla Nayak : ఇటీవల మలయాళంలో హిట్ అయిన చాలా సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఒకటి. ఈ సినిమాని తెలుగులో ‘భీమ్లా నాయక్’ సినిమాగా తెరకెక్కించారు. బిజూ మీనన్, పృద్వి రాజ్ సుకుమారన్ మలయాళంలో లీడ్ రోల్స్ చేశారు. ఆ పాత్రలని ఇక్కడ పవన్, రానాలు చేశారు. ‘భీమ్లా నాయక్’ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.
Pawan Kalyan : ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ వర్సెస్ ‘భీమ్లా నాయక్’
ఒరిజినల్ సినిమాలో, ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ ఎవరు చేశారో చూద్దాం….
మలయాళం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లో బిజూ మీనన్ చేసిన క్యారెక్టర్ ని ‘భీమ్లా నాయక్’లో పవన్ కళ్యాణ్ చేశారు. మలయాళంలో రిటైర్డ్ హవల్దార్ కోషి కురియన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించగా తెలుగులో ఆ పాత్రని రానా డేనియర్ శేఖర్ గా చేశాడు.
అయ్యప్ప నాయర్ భార్య కన్నమ్మగా గౌరీ నందన్ నటించగా ఇక్కడ భీమ్లా నాయక్ భార్యగా నిత్యామీనన్ నటించింది. కోషి కురియన్ భార్యగా అన్న రాజన్ రుబీ నటించగా తెలుగులో ఆ పాత్రని సంయుక్త మీనన్ నటించింది.
భీమ్లా నాయక్’లో డేనియల్ శేఖర్ తండ్రి సముద్రఖని పాత్రను ఒరిజినల్ వర్షన్‌లో రంజిత్ నటించారు. ‘భీమ్లా నాయక్’లో సీఐ కోదండరామ్ పాత్రలో నటించిన మురళీ శర్మ పాత్రను మలయాళం వర్షన్ లో సీఐ సతీష్ కుమార్ పాత్రలో అనిల్ నెడుమగద్ చేశారు.
డేనియల్ శేఖర్ డ్రైవర్ బాలాజీ పాత్రలో రఘుబాబు నటించిన పాత్రని ఒరిజినల్ వర్షన్ లో కోషి డ్రైవర్ పాత్రను రమేష్ కొట్టాయం చేశారు. రావు రమేష్ పాత్రను మయాళంలో సబూమన్ అబ్దుసమద్ నటించారు. ఇక మలయాళంలో బ్రహ్మానందం పాత్ర లేదు. ఇందులో సృష్టించారు.