Mahesh Babu : బీఏ రాజు కన్నుమూత, మహేష్ బాబు భావోద్వేగం..షాక్ తిన్న ఎన్టీఆర్

ప్రముఖ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. ఆయన చనిపోయిన విషయం తెలుసుకున్న టాలీవుడ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తి చేసింది. ఎన్నో సంవత్సరాలుగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

Mahesh Babu : బీఏ రాజు కన్నుమూత, మహేష్ బాబు భావోద్వేగం..షాక్ తిన్న ఎన్టీఆర్

Mahesh Babu

Updated On : May 22, 2021 / 1:26 PM IST

BA Raju Passesaway : ప్రముఖ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. ఆయన చనిపోయిన విషయం తెలుసుకున్న టాలీవుడ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తి చేసింది. ఎన్నో సంవత్సరాలుగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా..మహేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బీఏ రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ..సోషల్ మీడియాలో పోస్టు చేశారు.



బీఏ రాజు గారు తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, చాలా దగ్గరగా పనిచేయడం జరిగిందన్నారు. ఆయన ఒక జెంటిల్మెన్.. ఆయన మృతి తట్టుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు మహేష్ బాబు తెలిపారు.



బీఏ రాజు ఇక లేరని తెలుసుకుని తాను షాక్ కు గురయ్యానంటూ..జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. పీఆర్వోగా, జర్నలిస్ట్‌గా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఆయన గొప్ప సేవలు అందించారని కొనియాడారు. రాజుగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు.



Read More : BA Raju : ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత