బాలయ్య ఫ్యాన్స్ ఊరమాస్ బాబోయ్.. ట్రెండింగ్‌లో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘‘సింహా’’..

నందమూరి బాలకృష్ణ, బోయపాటిల ‘సింహా’ పదేళ్ల ట్రెండింగ్..

బాలయ్య ఫ్యాన్స్ ఊరమాస్ బాబోయ్.. ట్రెండింగ్‌లో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘‘సింహా’’..

Updated On : December 24, 2024 / 4:37 PM IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటిల ‘సింహా’ పదేళ్ల ట్రెండింగ్..

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘‘సింహా’’.. కనీవినీ ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ట్రెండింగ్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ.. బాలయ్య, బోయపాటి కలయికలో తెరకెక్కిన మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్.. ‘‘సింహా’’..2010 ఏప్రిల్ 30న విడుదలైన ఈ చిత్రం 2020 ఏప్రిల్ 30నాటికి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. #SimhaTrendOnApril29th పేరుతో ట్విట్టర్‌లో భారీగా పోస్టులు చేస్తున్నారు.

బుధవారం సాయంత్రం 6 గంటలకు ట్రెండ్‌కి రెడీగా ఉండమంటూ అభిమానులందరికీ పిలుపునివ్వగా.. ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో #DecadeForSimhaRoar హ్యాహ్ ట్యాగ్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ట్రెండింగ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే 50K ట్వీట్స్ క్రాస్ చేయడం విశేషం. ఈమధ్య కాలంలో బాలయ్య గురించి సోషల్ మీడియాలో ఇంత భారీ స్థాయిలో చర్చ జరగలేదు, ట్రెండ్ కాలేదు.. కానీ నటసింహం ఫ్యాన్స్ బాలయ్యపై అభిమానంతో ‘‘సింహా’’ ట్రెండ్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. బాలయ్య నటజీవితంలో ఈ చిత్రం అతిపెద్ద కమర్షియల్ హిట్‌గా నిలవడంతో పాటు ఆ దశాబ్దంలో రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమాగా కూడా చరిత్ర సృష్టించింది.