Baahubali The Epic : దసరా రోజు బాహుబలి టీమ్ గ్రూప్ ఫోటో వైరల్.. ‘బాహుబలి ఎపిక్’ కోసం పండగ పూట..

నేడు పండగ పూట కూడా బాహుబలి ఎపిక్ వర్క్స్ జరుగుతున్నాయి. (Baahubali The Epic)

Baahubali The Epic : దసరా రోజు బాహుబలి టీమ్ గ్రూప్ ఫోటో వైరల్.. ‘బాహుబలి ఎపిక్’ కోసం పండగ పూట..

Baahubali The Epic

Updated On : October 2, 2025 / 5:08 PM IST

Baahubali The Epic : తెలుగు సినీ పరిశ్రమ స్థితిగతులని మార్చిన సినిమా బాహుబలి. ఆ సినిమా వచ్చి పదేళ్లు అవుతుండటంతో రెండు పార్ట్ లను కలిపి ఒకే సినిమాగా రీ రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. బాహుబలి 1 – బాహుబలి 2 లను కలిపి బాహుబలి ఎపిక్ గా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.(Baahubali The Epic )

బాహుబలి ఎపిక్ అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీమ్ అంతా మళ్ళీ బాహుబలి సినిమా మీద వర్క్ చేస్తున్నారు. ఎడిటింగ్ లో కొంత భాగం తీసేసి రెండు సినిమాలను కలిపి దాదాపు 4 గంటల సినిమాగా కట్ చేయనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పనులు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి.

Also See : Vishnupriya Bhimeneni : సద్గురు ఆశ్రమంలో యాంకర్ విష్ణుప్రియ.. ఆదియోగి వద్దకు వెళ్లి.. ఫొటోలు..

నేడు పండగ పూట కూడా బాహుబలి ఎపిక్ వర్క్స్ జరుగుతున్నాయి. నేడు దసరా కావడంతో బాహుబలి సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు అంతా ఒకేచోట కలిసి రీ యూనియన్ అయ్యారు. వీరంతా కలిసి గ్రూప్ ఫోటో దిగడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో… రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, శోభు యార్లగడ్డ, కాల భైరవ, సెంథిల్ కుమార్, కార్తికేయ, శ్రీవల్లి తో పాటు మరికొంతమంది సాంకేతిక నిపుణులు ఉన్నారు.

Baahubali The Epic Re Releasing Works Happening under Rajamouli Technicians Group Photo goes Viral

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాజమౌళిని అభినందిస్తూ మరోసారి విజువల్ వండర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అని అంటున్నారు. రాజమౌళి కూడా బాహుబలి రీ రిలీజ్ మీద బాగానే కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం చేస్తున్న మహేష్ సినిమా కొన్ని రోజులు పక్కన పెట్టి ఈ సినిమా పనులు చూసుకుంటున్నాడు.

Also See : Malavika Mohanan : ఫ్రెండ్స్ తో రాజాసాబ్ భామ దసరా సెలబ్రేషన్స్.. ఫొటోలు..