Krishna Mallidi : బేబీ సినిమాలో వైష్ణవిని పెళ్లి చేసుకున్న యాక్టర్ ఎవరో తెలుసా.. ఆ హిట్ డైరెక్టర్‌కి బ్రదర్, హాట్ యాంకర్‌కి రిలేటివ్..

మొత్తానికి బేబీని పెళ్లి చేసుకున్నది ఎవరో తెలిసిపోయింది. అతని పేరు కృష్ణ మల్లిడి. ఇప్పటికే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.

Krishna Mallidi : బేబీ సినిమాలో వైష్ణవిని పెళ్లి చేసుకున్న యాక్టర్ ఎవరో తెలుసా.. ఆ హిట్ డైరెక్టర్‌కి బ్రదర్, హాట్ యాంకర్‌కి రిలేటివ్..

Baby Movie Climax Viral Groom Krishna Mallidi Full Details Here

Updated On : September 8, 2023 / 9:23 AM IST

Krishna Mallidi : ఇటీవల వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya), ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో వచ్చిన బేబీ(Baby) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన బేబీ యూత్ కి బాగా కనెక్ట్ అయి ఏకంగా 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ తను ప్రేమించిన వాళ్ళిద్దర్నీ కాకుండా క్లైమాక్స్ లో ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది.

దీంతో ఆ క్లైమాక్స్ సీన్ వైరల్ గా మారింది. బేబీ సినిమాలో హీరోయిన్ పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు బాగా వైరల్ అయ్యాడు. అతని పై బాగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఒక్క సినిమాలో కొన్ని సెకండ్స్ కనిపించిన క్యారెక్టర్ తో బాగా వైరల్ అయిపోయాడు అని అంతా అనుకుంటున్నారు. దీంతో అతను ఎవరా అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు.

మొత్తానికి బేబీని పెళ్లి చేసుకున్నది ఎవరో తెలిసిపోయింది. అతని పేరు కృష్ణ మల్లిడి. ఇప్పటికే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. కలర్ ఫోటో సినిమాలో కూడా హీరోకి సీనియర్ క్యారెక్టర్ లో కనిపించాడు. చాలా సినిమాలు చేసినా నటుడిగా బ్రేక్ రావట్లేదు. ఇక కృష్ణ బింబిసార లాంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ వశిష్టకు బ్రదర్ కూడా. అంతే కాకుండా హాట్ యాంకర్ విష్ణుప్రియకు కూడా ఇతను రిలేటివ్ అవుతాడు. అతని సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేశాడు. ఇటీవల ఓ టీవీ షోకి కూడా అతన్ని తీసుకొచ్చారు.

Bahubali 2 : ఇప్పటికి అందులో బాహుబలి 2 రికార్డ్‌ని ఎవ్వరు టచ్ చేయలేదు.. జవాన్ వల్ల కూడా కాలేదు..

మొత్తానికి బేబీ సినిమాలో పెళ్లి కొడుకుని కనిపెట్టేసాం అని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. మరి ఈ రకంగా అయినా అతనికి మంచి క్యారెక్టర్స్ వచ్చి గుర్తింపు వస్తుందేమో చూడాలి.