One/4 : వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ & క్రైమ్ డ్రామా.. బాహుబలికి పనిచేసిన వ్యక్తి దర్శకుడిగా..

ప్రభాస్ బాహుబలి సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

One/4 : వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ & క్రైమ్ డ్రామా.. బాహుబలికి పనిచేసిన వ్యక్తి దర్శకుడిగా..

One/4

Updated On : July 26, 2025 / 8:28 PM IST

One/4 Movie : తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ నిర్మాణంలో వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా వన్ బై ఫోర్ (one/4). టెంపర్ వంశి, ఆర్ఎక్స్ 100 కరణ్ విలన్స్ గా నటిస్తున్నారు. ప్రభాస్ బాహుబలి సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉంది. త్వరలో సెన్సార్ పూర్తిచేసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Jr NTR : ఇంటిని రీ ఇన్నోవేషన్ చేయించిన ఎన్టీఆర్.. ఇంటీరియర్ టీమ్ తో ఫొటోలు..

తాజాగా దర్శక నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ.. వన్ బై ఫోర్ (one/4) ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా సినిమా. షూటింగ్ మొత్తం వైజాగ్ లో జరిగింది. నోరు జారితే జరిగే పరిణామాలు, వాటివల్ల వచ్చే సమస్యలు ఎలాఉంటాయో ఈ సినిమా కథ. మంచి థ్రిల్లింగ్ కథ తో అద్భుతమైన క్రైమ్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించాం. టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తాము. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాము అని తెలిపారు.