NBK 111: నందమూరి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. లెక్కలు కుదరడం లేదట.. పీరియాడికల్ మూవీ క్యాన్సిల్!
నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో ఇటీవల మొదలైన ప్రాజెక్టు(NBK 111) కోసం కొత్త కథను సిద్ధం చేస్తున్నారట.
Balakrishna and Gopichand Malineni NBK 111 film story changed
- బాలయ్య-గోపీచంద్ మలినేని కొత్త సినిమా
- కథను మార్చేశారట
- పీరియాడికల్ డ్రామా కాదు రెగ్యులర్ మాస్ మూవీ
NBK 111: నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా హిట్స్ మీద హిట్స్ సాధిస్తూ కుర్ర హీరోలకు సైతం ఛాలెంజ్ విసురుస్తున్నాడు. అఖండ నుంచి అఖండ 2 వరుసగా ఐదు బ్లాక్ బస్టర్ హిట్స్ ని సాధించాడు బాలయ్య(NBK 111). ఈమధ్య కాలంలో ఒక హిట్ కొట్టడానికి సమతమవుతున్నారు. అలాంటిది వరుసగా ఐదు హిట్స్ అంటే మాములు విషయం కాదు.
ఈ విషయంలో సీనియర్ హీరోలు ఆయన దరిదాపుల్లో కూడా లేరు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పీరియాడికల్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలయ్యింది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నట్టు కూడా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
మరోసారి సరికొత్త అవతారంలో బాలకృష్ణ కనిపించబోతున్నాడు, ఈసారి కూడా బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ, తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, పీరియాడికల్ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా కథను మేకర్స్ మారుస్తున్నారట.
దానికి కారణం ప్రస్తుతం సినిమాలకు సంబందించిన ఆర్ధిక వ్యవహారాల్లో వచ్చిన మార్పులేనట. షూటింగ్ కి చాలా టైమ్ తీసుకోవడం, భారీ బడ్జెట్, ఓటిటి ఆదాయం తగ్గడం, హిందీ రైట్స్ రెవెన్యూ సైతం తగ్గడం. వీటన్నిటినీ లెక్కవేసుకుంటే పాజిటీవ్ కంటే నెగిటీవ్ ఎక్కువగా కనిపిస్తోందట. అందుకే, ఇంత భారీ సినిమా కాకుండా సింపుల్ కథతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందుకోసం కొత్త కథను రెడీ చేసే పనిలో పడ్డాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారట మేకర్స్.
