కరోనా కన్‌ఫ్యూజ్ చేస్తోంది.. వ్యాక్సిన్ రాదు.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు..

  • Published By: sekhar ,Published On : November 16, 2020 / 03:20 PM IST
కరోనా కన్‌ఫ్యూజ్ చేస్తోంది.. వ్యాక్సిన్ రాదు.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు..

Updated On : November 16, 2020 / 3:27 PM IST

Balakrishna – Corona Vaccine: నటసింహా నందమూరి బాలకృష్ణ సోమవారం హర్ష్ కానుమిల్లి హీరోగా పరిచయమవుతున్న ‘సెహరి’ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన అనంతరం బాలకృష్ణ కరోనా వైరస్‌ కారణంగా సినీ ఇండస్ట్రీ పడుతున్న ఇబ్బందులు, మనుషులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి చెబుతూనే కొన్ని సూచనలు కూడా చేశారు. ఈ క్రమంలో ఆయన కరోనా వైరస్‌ గురించి, కరోనా వ్యాక్సిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.


బాలయ్య మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఎలా ఉండాలనే విషయాన్ని అందరూ ఆలోచించాలి. దురదృష్టవశాత్తు ఇప్పుడు కరోనా పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ షూటింగ్ చేస్తున్న ‘సెహరి’ యూనిట్‌ను నేను అభినందిస్తున్నాను. పలు ఛానెల్స్‌లో భక్తి కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఈ కార్తీక మాసంలో చల్లటి నీటితో తలస్నానం చేయండని చెబుతారు. కానీ ఎవరూ కూడా చల్లటి నీళ్లతో తలస్నానం చేయవద్దని నేను చెబుతున్నాను.


ఎందుకంటే కరోనా అనేది నిమోనియాకు సంబంధించింది. దానికి ఇంత వరకు వ్యాక్సిన్‌ రాలేదు. రాదు కూడా. కరోనా అనేది మనిషి మెదడును కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. ప్రకృతిని మనం అతిక్రమిస్తే, ప్రకృతి మనకెలా సమాధానం చెబుతుందనే దానికి ఉదాహరణే ఈ కరోనా. కాబట్టి ఎవరూ తలస్నానాలు చల్లటి నీటితో చేయవద్దు. వేడి నీళ్లతోనే స్నానాలు చేయండి.

https://10tv.in/first-look-of-sehari-launched-by-nandamuri-balakrishna/

Image

ఆరోగ్య సూచనలు పాటించండి. కరోనా వైరస్‌ నివారణకు ఇంకా సమయం పడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనం బలంగా ఉండాలి. చూస్తుంటే కరోనా అనేది మన జీవితంలోఓ భాగమైపోతుందేమోననిపిస్తుంది’’ అన్నారు.