Balakrishna: “ఆర్ఆర్ఆర్” ప్రొడ్యూసర్ తో బాలయ్య భారీ చిత్రం.. డైరెక్టర్?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో కలిసి "RRR" వంటి గొప్ప చిత్రాన్ని తీసినందుకు, నిర్మాత డివివి దానయ్య కూడా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే అంతటి విజయాన్ని అందుకున్న ఈ నిర్మాత ఇప్పటి వరకు తన తదుపరి సినిమా ప్రకటించలేదు. అయితే ఈ నిర్మాత త్వరలో మళ్ళీ ఒక క్రేజీ కాంబినేషన్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది.

Balakrishna: “ఆర్ఆర్ఆర్” ప్రొడ్యూసర్ తో బాలయ్య భారీ చిత్రం.. డైరెక్టర్?

Balakrishna With RRR Producer

Updated On : October 10, 2022 / 11:50 AM IST

Balakrishna: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో కలిసి “RRR” వంటి గొప్ప చిత్రాన్ని తీసినందుకు, నిర్మాత డివివి దానయ్య కూడా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే అంతటి విజయాన్ని అందుకున్న ఈ నిర్మాత ఇప్పటి వరకు తన తదుపరి సినిమా ప్రకటించలేదు. అయితే ఈ నిర్మాత త్వరలో మళ్ళీ ఒక క్రేజీ కాంబినేషన్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది.

Balayya: కమెడియన్ సప్తగిరి కాళ్లు పట్టుకుంటా అన్న బాలయ్య.. ఎందుకు?

గతంలో దానయ్య రామ్ చరణ్‌తో ఒక సినిమా అనౌన్స్ చేస్తాడని వార్తలు వినిపించిన, వాటిలో నిజం లేదని తెలిసిపోయింది. కాగా ఈ నిర్మాత ఇప్పుడు నందమూరి నటసింహం బాలయ్యతో చేతులు కలపబోతున్నాడట. బాలయ్య హీరోగా ఒక యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించడానికి ఈ ప్రొడ్యూసర్ సన్నాహాలు చేస్తున్నాడట.

ప్రముఖ ఓటిటి సమస్త ఆహాలో ప్రసారమవుతున్న “అన్‌స్టాపబుల్” టాక్ షో ప్రమోషన్స్ కోసం జత కట్టిన బాలయ్య, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కోసం చేతులు కలపనున్నారట. డైరెక్టర్ ప్రశాంత్ ఇప్పటికే బాలకృష్ణకు కథ కూడా వినిపించినట్లు, బాలయ్య కూడా ఓకే చెప్పినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.