బాలయ్యతో లైలా – వైరల్ అవుతున్న పిక్

అలీతో సరదాగా షోలో ఒకప్పటి హీరోయిన్ లైలా.. నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి చెప్పగా ఆ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది..

  • Published By: sekhar ,Published On : September 20, 2019 / 05:16 AM IST
బాలయ్యతో లైలా – వైరల్ అవుతున్న పిక్

Updated On : September 20, 2019 / 5:16 AM IST

అలీతో సరదాగా షోలో ఒకప్పటి హీరోయిన్ లైలా.. నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి చెప్పగా ఆ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది..

నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఆయనకు కోపం ఎక్కువ, అభిమానులపై చెయ్యి చేసుకుంటాడు. ఆయనతో వేగడం కష్టం.. అదీ ఇదీ అని చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు.. కానీ బాలయ్య ఎలాంటివాడో ఆయనతో పనిచేసిన వాళ్లు, ఆయణ్ణి దగ్గరినుండి చూసినవాళ్లు చెప్తారు. బాలయ్య భోళాశంకరుడు, ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం.. పది మందికి పెట్టాలన్నా బాలయ్యే, తేడాగా ప్రవర్తిస్తే నలుగురిని కొట్టినా బాలయ్యే అని చెప్తుంటారు.

ఇప్పుడు బాలయ్య గురించి టాపిక్ ఎందుకొచ్చిందంటే, రీసెంట్‌గా అలీతో సరదాగా షోకి ఒకప్పటి హీరోయిన్ లైలా వచ్చింది. లేటెస్ట్ ప్రోమోలో అలీ.. లైలాను బాలకృష్ణ గురించి అడగ్గా.. ఈరోజు ఉదయమే ఆయణ్ణి కలిశానని, ఆయన రియల్ ఐరన్‌మ్యాన్ అని చెప్పుకొచ్చింది. బాలయ్య, లైలా కలిసి పవిత్రప్రేమ సినిమా చేశారు.

Read Also : హృతిక్ హీరో – ప్రభాస్ విలన్?

ఈ ప్రోమో వీడియోతో పాటు, లైలా బాలయ్యతో కలిసి తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు బాలయ్య అభిమానులు.. బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న NBK 105 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది.