Bandla Ganesh: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. నేనొస్తున్నానంటున్న బండ్ల

నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగానే కాకుండా పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడికి తనను..

Bandla Ganesh: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. నేనొస్తున్నానంటున్న బండ్ల

Bandla Ganesh

Updated On : March 13, 2022 / 2:25 PM IST

Bandla Ganesh: నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగానే కాకుండా పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడికి తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న బండ్ల గణేష్ సందర్భాన్ని బట్టి ఆ విషయాన్ని మరింత గర్వంగా కూడా చెప్పుకుంటాడు. ఎక్కడ ఎలా ఛాన్స్ వచ్చిన మెగా కీర్తన చేసే బండ్ల గణేష్ ఇక పవన్ కళ్యాణ్ ను పొగుడుతుంటే ఆ పవన్ కళ్యాణ్ కూడా విరగబడి నవ్వేస్తుంటాడు.

Bandla Ganesh: బండ్లకి ఇష్టమైన తెలుగు జాతి రత్నాలు వీళ్లేనట.. ట్వీట్ వైరల్!

ఇక బండ్ల స్పీచ్ లపై పవన్ అభిమానులు కూడా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంటారు. అదేంటో పాపం బండ్ల పవన్ గురించి ఆవేశంతో ఎంతో సీరియస్ గా చెప్పినా అది అందరికి కామెడీగానే కనిపిస్తుంది. చివరికి బండ్ల దేవుడు పవన్ కు కూడా కామెడీగానే ఉంటుంది. అందుకే పవన్ బండ్ల స్పీచ్ అంటే తెగ నవ్వుకుంటాడు. ఏది ఏమైనా పవన్ కు సంబంధించి అన్ని సినిమాల వేడుకలలో కనిపించే బండ్ల తాజాగా జరిగిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించలేదు.

Bandla Ganesh: మీరు సూపర్‌ సార్‌.. చిరును తెగ పొగిడేసిన బండ్ల!

దీంతో బండ్ల స్పీచ్ లేకపోవడంతో అభిమానులలో జోష్ తగ్గింది. అసలు పవన్ వేడుకలో బండ్ల లేకపోవడం ఏంటని కూడా రకరకాల గాసిప్స్ కూడా ప్రచారం జరిగింది. అయితే.. మొన్న మిస్ అయినా మీకోసం నేను వస్తున్నా అంటూ బండ్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. ఈ మీటింగ్ కి తాను కూడా వస్తున్నానని బండ్ల కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సభకి కేవలం అభిమానిగా వెళ్తున్నాడా.. జనసేన పార్టీ తరపున వెళ్తున్నాడా చెప్పలేదు కానీ స్టేజ్ ఎక్కి పవన్ ఫ్యాన్స్ మిస్సవుతున్న మాస్ స్పీచ్ వదలడం ఖాయంగా కనిపిస్తుంది.