Bangarraju Movie : గెట్ రెడీ అక్కినేని ఫ్యాన్స్.. చైతన్య బర్త్‌డేకి రెండు సర్‌ప్రైజెస్..
నవంబర్ 23న చైతన్య బర్త్‌డే సందర్భంగా ‘బంగార్రాజు’ నుండి రెండు సర్‌ప్రైజెస్ రాబోతున్నాయి..

Naga Chaitanya
Bangarraju Movie: కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకిది ప్రీక్వెల్. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బంగార్రాజు’ లో రమ్యకృష్ణ, కృతి శెట్టి ఫీమేల్ లీడ్స్.
Laddunda Song : ‘లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’ – నాగ్ భలే పాడాడుగా!
జీ5 సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మిస్తున్నారు. ఇటీవల నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే ఆయన పాడిన ‘లడ్డుండా’ పాట విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘బంగార్రాజు’ లో నాగలక్ష్మీ క్యారెక్టర్ చేస్తున్న కృతి శెట్టి లుక్ కూడా ఆకట్టుకుంది.
Krithi Shetty : ‘నాగ లక్ష్మీ’ గా కృతి శెట్టి..
నవంబర్ 23న చైతన్య బర్త్‌డే సందర్భంగా ‘బంగార్రాజు’ నుండి రెండు సర్‌ప్రైజెస్ రాబోతున్నట్లు ప్రకటించారు టీం. ‘‘వాసివాడి తస్సాద్దియ్యా! ‘బంగార్రాజు’ సందడి లేకపోతే ఎలాగా’’ అంటూ నవంబర్ 22న సాయంత్రం 5:22 గంటలకు నాగార్జున ఫస్ట్‌లుక్, నవంబర్ 23 ఉదయం 10:23 గంటలకు ‘బంగర్రాజు’ టీజర్ విడుదల చెయ్యబోతున్నారు.
#Bangarraju Coming !!!@chay_akkineni @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @anuprubens @ZeeStudios_ @lemonsprasad #Bangarrajucoming pic.twitter.com/YmcAoevFx5
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 20, 2021