Humaira Himu : అనుమానాస్పద స్థితిలో బంగ్లాదేశ్ న‌టి మృతి.. ఆస్ప‌త్రి నుంచి ప‌రారైనా స్నేహితుడు..!

ప్ర‌ముఖ బంగ్లాదేశ్ న‌టి హుమైరా హిము అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. ఆమె నివాసంలో గురువారం చ‌ల‌నం లేని స్థితిలో గుర్తించిన కుటుంబ స‌భ్యులు ఆమెను ఆసుపత్రికి త‌రలించారు.

Humaira Himu : అనుమానాస్పద స్థితిలో బంగ్లాదేశ్ న‌టి మృతి.. ఆస్ప‌త్రి నుంచి ప‌రారైనా స్నేహితుడు..!

Humaira Himu

Updated On : November 4, 2023 / 5:31 PM IST

Humaira Himu Dies : ప్ర‌ముఖ బంగ్లాదేశ్ న‌టి హుమైరా హిము అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఆమె నివాసంలో చ‌ల‌నం లేని స్థితిలో గుర్తించిన కుటుంబ స‌భ్యులు ఆమెను ఉత్తరా అధునిక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి త‌రలించారు. ఆమెను ప‌రిశీలించిన వైద్యులు అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించారు. న‌టి వ‌య‌స్సు 37 సంవ‌త్స‌రాలు. ఆమె మెడ‌పైన గాట్లు ఉన్న‌ట్లు గుర్తించిన వైద్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

కాగా.. అప్ప‌టి వ‌ర‌కు ఆస్ప‌త్రిలో ఉన్న న‌టి స్నేహితుడు పోలీసులు అక్క‌డికి చేరుకునే లోపు అక్క‌డి నుంచి ప‌రారు అయ్యాడు. దీంతో న‌టి అనుమానాస్ప‌ద మృతిపై మ‌రిన్ని అనుమానాలు నెల‌కొన్నాయి. పోలీసులు అత‌డి కోసం గాలింపు చేప‌ట్టారు. న‌టి హుమైరా హిము మ‌ర‌ణం ప‌ట్ల బంగ్లా ఫిలిం ఇండ‌స్ట్రీ సంతాపం తెలియ‌జేసింది.

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ నుంచి ‘మసాలా’ అప్డేట్.. ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

2006లో హుమైరా హిము తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ‘చాయాబితి’ సిరీస్‌తో టెలివిజన్‌లోకి ప్రవేశించింది. ‘బారి బారి సారీ సారీ’, ‘హౌస్‌ఫుల్ష‌’, ‘గుల్షన్ అవెన్యూ’తో సహా పలు టీవీ సిరీయ‌ల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోర్షెదుల్ ఇస్లాం దర్శకత్వం వహించిన ‘అమర్ బోంధు రాషెడ్’ సినిమాతో ఆమె చిత్ర సీమ‌లో అడుగుపెట్టింది. మొద‌టి చిత్రంతోనే ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందింది.

కాగా.. ఆమె ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డంతో ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉండొచ్చున‌ని వారు భావిస్తున్నారు. అయితే.. పోస్టు మార్టం నివేదిక వస్తేనే అస‌లు విష‌యం తెలుస్తుంద‌ని అంటున్నారు. న‌టి మృతి పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Bigg Boss 7 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అత‌డేనా..?