Salt Remedy: తరుచుగా గొడవలు, తగాదాలు అవుతున్నాయా? శనివారం రోజున ఇలా చేస్తే చాలు..!
ఈ పరిహారం చేస్తే ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్లతో గొడవలు, తగాదాలు అవటం అనేది క్రమక్రమంగా తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు. Salt
Salt Remedy Representative Image (Image Credit To Original Source)
Salt Remedy: ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్లలో గొడవలు అవుతున్నాయా? అయిన దానికి కాని దానికి తగాదాలు అవుతున్నాయా? అయితే ఉప్పుకి సంబంధించిన ఈ పరిహారం పాటిస్తే ఆ గొడవలు, తగాదాలన్నీ తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు.
పరిహార శాస్త్రంలో దొడ్డు ఉప్పుకు విశేషమైన ప్రాధాన్యత ఉందంటున్నారు పెద్దలు. ఎవరైనా సరే.. ప్రతి చిన్న విషయానికి తరుచుగా గొడవులు ఎక్కువగా అవుతుంటే.. శనివారం రోజున ఉప్పుకి సంబంధించి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలని సూచిస్తున్నారు. శనివారం రోజున కొత్తని తెల్లటి వస్త్రం తీసుకోవాలి. అందులో ఏడు పలుకుల ఉప్పు ఉంచాలి. దాన్ని మూట కట్టాలి. ఆ మూటను పూజా మందిరంలో ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర ఉంచాలి. లేదంటే దుర్గాదేవి ఫోటో ఉంటే అక్కడైనా ఉంచొచ్చు.
ఆ తర్వాత మూటకు దీపారాధన చేయాలి. సామ్రాని పొగ వేయాలి. దూపం వేశాక నమస్కారం చేసుకుని ఇంట్లో దక్షిణ దిక్కులో గిన్నెలో ఈ మూటను పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఆ మూటను తాకకుండా చూసుకోవాలి. ఈ పరిహారం చేసేటప్పుడు అస్సలు మాట్లాడొద్దు. అలా మాట్లాడకుండానే చేస్తే ఈ పరిహారం పని చేస్తుందని పండితులు స్పష్టం చేశారు.
అలా ఉంచిన మూటను నెల రోజుల వరకు ఎవరూ తాకకుండా చూసుకోవాలి. ఇంట్లో ఎవరూ అంటే పెద్దలు కానీ, పిల్లలు కానీ తాకకూడదు. నెల రోజులు పూర్తైన తర్వాత మూటలో ఉన్న ఉప్పుని ఎక్కడైనా పారే నీళ్లలో విడిచిపెట్టండి. మాకు దగ్గరలో పారే నీళ్లు లేవు అనే వారు మీ ఇంట్లో సింకులో పోసి నీళ్లు తిప్పాలి. ఆ తర్వాత ఆ తెల్లటి వస్త్రంలో పరిహారం ఏదీ చేయకూడదు.
ఇదే పరిహారాన్ని మళ్లీ చేయాలి అనుకుంటే మరో కొత్త తెల్లటి వస్త్రం తీసుకోవాలి. పాత తెల్లటి వస్త్రాన్ని ఎవరూ తొక్కని చోట పడేయాలి. ఉప్పు ఏ విధంగా అయితే పారే నీళ్లలో విడిచిపెడతామో అలా తెల్లటి వస్త్రాన్ని కూడా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పడేయాలి. ఈ పరిహారం చేస్తే ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్లతో గొడవలు, తగాదాలు అవటం అనేది క్రమక్రమంగా తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎదుటి వాళ్లతో గొడవలు కాకుండా శనివారం పాటించే ఈ ఉప్పు పరిహారం చాలా అద్భుతంగా పని చేస్తుందని, విశేషమైన ప్రయోజనం పొందుతారు.
Also Read: దరిద్ర దేవత మీ జోలికి రావద్దన్నా.. లక్ష్మీ కటాక్షంతో మీకు డబ్బులు రావాలన్నా ఇలా చేయాలి..
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
