Beats Of Radhe Shyam: చరిత్రలో నిలిచిపోయే ప్రేమజంట..

Beats Of Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్.. ‘‘రాధే శ్యామ్’’.. ప్రభాస్ 20వ సినిమా ఇది. హాట్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయిక. రెబల్ స్టార్ డా.యు.వి.కృష్ణంరాజు సమర్పణలో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.
అక్టోబర్ 23 డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్” పేరిట మోషన్ పోస్టర్ విడుదల చేశారు. రోమియో-జూలియట్, సలీం-అనార్కలి, దేవదాసు-పార్వతి జంటలను చూపిస్తూ విక్రమాదిత్య, ప్రేరణ జంటను చూపించిన తీరు ఆకట్టుకుంటోంది.
సూపర్ స్టైలిష్ లుక్‌లో ప్రభాస్, గ్లామరస్‌గా పూజా కనిపిస్తున్నారు. రన్నింగ్ ట్రైన్‌లో వేలాడుతూ ప్రేమ తన్మయత్వంలో తేలియాడుతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడభాషల్లో విడుదల చేయనున్నారు.