Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా టైటిల్, గ్లింప్స్ వచ్చేసింది.. ‘హైందవ’ అదిరిందిగా..

తాజాగా ఈ సినిమాకు హైందవ అనే టైటిల్ ప్రకటిస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా టైటిల్, గ్లింప్స్ వచ్చేసింది.. ‘హైందవ’ అదిరిందిగా..

Bellamkonda Sai Sreenivas Haindava Movie Glimpse Released

Updated On : January 8, 2025 / 4:40 PM IST

Bellamkonda Sai Sreenivas : తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై లుదీర్ బైరెడ్డి నిర్మాణంలో మహేష్ చందు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. BSS 11 వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఈ సినిమాని ప్రకటించారు. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు హైందవ అనే టైటిల్ ప్రకటిస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Also Read : Game changer : గేమ్ ఛేంజ‌ర్ నుంచి ‘కొండ దేవర’ పాట వ‌చ్చేసింది.. విన్నారా?

ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇదేదో మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాలుగా అనిపిస్తుంది. ఈ గ్లింప్స్ లో కొంతమంది దుండగులు ఓ గుడిని తగలబెడదాం అనుకుంటే శ్రీనివాస్, ఓ వరాహం, ఓ సింహం వచ్చి కాపాడినట్టు చూపించారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో విష్ణుమూర్తి దశావతారాలు చూపించారు. ఇదేదో బాగానే వర్కౌట్ అయ్యేలా అనిపిస్తుంది. గ్లింప్స్ లో షాట్స్ అయితే అదిరిపోయాయి. మీరు కూడా హైందవ గ్లింప్స్ చూసేయండి..

ఈ హైందవ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. వరుసగా యాక్షన్ సినిమాలతో వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చివరగా తెలుగులో 2021లో అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా వచ్చి నాలుగేళ్లు అయిపోతుంది. మధ్యలో హిందీ ఛత్రపతి సినిమా తప్ప ఇంకే సినిమా రాలేదు శ్రీనివాస్ నుంచి. దీంతో శ్రీనివాస్ అసలు సినిమాలు చేస్తున్నాడా అనే సందేహాలు కూడా వచ్చాయి. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి కొత్త కొత్త కథలతో రాబోతున్నాడు.

త్వరలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ తో పాటు మనోజ్, నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. ఆ తర్వాత భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాతో రాబోతున్నాడు. అలాగే BSS12 సినిమా కూడా అనౌన్స్ చేసారు. మరో రెండు సినిమాలు కూడా శ్రీనివాస్ చేతిలో ఉన్నాయి. కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చినా త్వరలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు శ్రీనివాస్.

Also Read : Sonu Sood : అంద‌రూ టికెట్ల రేట్లు పెంచుతుంటే.. త‌గ్గించిన సోనూసూద్‌.. సంక్రాంతి బ‌రిలో..

ఇక ఇటీవల శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరమే శ్రీనివాస్ పెళ్లి జరుగుతుంది. ఇండస్ట్రీ బయటి వ్యక్తిని ఒక అమ్మాయిని చూసాము అని తెలిపారు.