Bhagavanth Kesari : బాల‌య్య ‘భగవంత్ కేసరి’ హ‌రికృష్ణ సినిమా రీమేకా..? అస‌లు నిజం ఏంటంటే..?

నందమూరి న‌ట సింహం బాలకృష్ణ (Balakrishna) అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం భగవంత్ కేసరి(Bhagavanth Kesari). కాజ‌ల్ అగ‌ర్వాల్‌ క‌థానాయిక కాగా శ్రీలీల కీల‌క పాత్రలో న‌టిస్తోంది.

Bhagavanth Kesari : బాల‌య్య ‘భగవంత్ కేసరి’ హ‌రికృష్ణ సినిమా రీమేకా..?  అస‌లు నిజం ఏంటంటే..?

Bhagavanth Kesari

Bhagavanth Kesari : నందమూరి న‌ట సింహం బాలకృష్ణ (Balakrishna) అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం భగవంత్ కేసరి(Bhagavanth Kesari). కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal) క‌థానాయిక కాగా శ్రీలీల(Sreeleela) కీల‌క పాత్రలో న‌టిస్తోంది. థ‌మన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది లు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విల‌న్ రోల్‌ను పోషిస్తుండ‌గా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. ఇటీవ‌లే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. బాల‌కృష్ణ లుక్‌, డైలాగ్ డెలివ‌రీ చాలా కొత్త‌గా ఉందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేశారు. సినిమా రీలీజ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సినిమాపై సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రం నంద‌మూరి హ‌రికృష్ణ న‌టించిన స్వామి సినిమానికి రీమేక్ అని ఆ వార్త సారాంశం.

Akshay Kumar : ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం అందుకున్న అక్షయ్.. మరి ఇన్నాళ్లు ఏ దేశపౌరుడిగా..?

2004లో వ‌చ్చి స్వామి సినిమాకి భ‌గ‌వంత్ కేస‌రి అన‌ధికార రీమేక్ నిజ‌మేనా అంటూ ఓ నెటీజ‌న్ ట్వీట్ చేయ‌గా దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. అందులో ఎటువంటి నిజం లేద‌ని చెప్పుకొచ్చింది. అస‌లు నిజం ఏమిట‌నేది అక్టోబ‌ర్ 19న తెలుస్తుంద‌ని తెలిపింది. ఇంత‌క ముందు ఎన్న‌డూ చూడ‌ని బాల‌య్య‌ను ఈ సారి వెండితెర పై చూస్తారంటూ రాసుకొచ్చింది. సో మొత్తానికి స్వామి చిత్రానికి భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్ కాద‌ని తేల్చి చెప్పింది.

బాల‌య్య అంటే యాక్ష‌న్‌, అనిల్ రావిపూడి అంటే కామెడీ. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్ అన‌గానే ఓ ర‌క‌మైన ఆస‌క్తి ఏర్ప‌డింది. అందుకు త‌గ్గ‌ట్లే టీజ‌ర్ ఉండ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. మ‌రి నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రిగా బాల‌య్య ఎలా న‌టించారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

Hyper Aadi : ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. ఆమెతోనే నిజమైన ప్రేమ..