Bhagavanth Kesari : రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసిన బాలయ్య.. అదరగొడుతున్న భగవంత్ కేసరి కలెక్షన్స్..

బాలయ్య నుంచి వచ్చే రెగ్యులర్ యాక్షన్ మూవీ, అనిల్ రావిపూడి నుంచి వచ్చే రెగ్యులర్ కామెడీ కమర్షియల్ మూవీ కాకుండా బిన్నంగా ఎమోషన్స్, మెసేజ్ లతో భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులని మెప్పించింది.

Bhagavanth Kesari : రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసిన బాలయ్య.. అదరగొడుతున్న భగవంత్ కేసరి కలెక్షన్స్..

Bhagavanth Kesari Movie Two Days Collections Details

Updated On : October 21, 2023 / 12:02 PM IST

Bhagavanth Kesari Collections : బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. బాల‌య్య‌కు జోడిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal) నటించగా శ్రీలీల(Sreeleela) బాలయ్య బాబుకి కూతురి పాత్ర‌లో నటించి మెప్పించింది.

బాలయ్య నుంచి వచ్చే రెగ్యులర్ యాక్షన్ మూవీ, అనిల్ రావిపూడి నుంచి వచ్చే రెగ్యులర్ కామెడీ కమర్షియల్ మూవీ కాకుండా బిన్నంగా ఎమోషన్స్, మెసేజ్ లతో భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులని మెప్పించింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టగా రెండో రోజు 18 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రెండు రోజులోనే ఈ సినిమా 51.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.

Also Read : 47 ఏళ్లుగా అన్నపూర్ణ స్టూడియోస్‌ లోనే పని చేస్తున్న ఎంప్లాయ్‌.. స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పిన నాగార్జున, సుప్రియ..

దీంతో బాలయ్య బాబు రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసాడు. ఇంకా వీకెండ్, పండగ ఉండటంతో 100 కోట్లు ఈజీగా కొట్టేస్తాడని అభిమానులు అంటున్నారు. ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో 100 కోట్ల విజయాలు సాధించగా ఈ సినిమాతో కూడా అది సాధించి 100 కోట్ల హ్యాట్రిక్ బాలయ్య కొడతారని భావిస్తున్నారు. ఇక భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 65 కోట్ల వరకు జరిగింది. అంటే దాదాపు 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.