Big Boss 5లో స్ట్రాంగ్ ఫీమేల్ కంటెస్టెంట్స్.. ఎందుకో తెలుసా?

బిగ్ బాస్ తాజాగా సీజన్ కు సమయం ఆసన్నమైంది. మళ్ళీ బుల్లితెర మీద సందడి చేసేందుకు కింగ్ నాగార్జున సిద్దమయ్యాడు. ఎన్టీఆర్, నానీల తర్వాత నాగ్ వరుసగా మూడవ సీజన్ కూడా బిగ్ బాస్ హౌస్ కు..

Big Boss 5లో స్ట్రాంగ్ ఫీమేల్ కంటెస్టెంట్స్.. ఎందుకో తెలుసా?

Bigg Boss 5

Updated On : August 29, 2021 / 1:05 PM IST

Big Boss 5: బిగ్ బాస్ తాజాగా సీజన్ కు సమయం ఆసన్నమైంది. మళ్ళీ బుల్లితెర మీద సందడి చేసేందుకు కింగ్ నాగార్జున సిద్దమయ్యాడు. ఎన్టీఆర్, నానీల తర్వాత నాగ్ వరుసగా మూడవ సీజన్ కూడా బిగ్ బాస్ హౌస్ కు మెంటార్ కానున్నాడు. ఈసారి నాగ్ ఎలాంటి స్టైల్ లో రానున్నాడు.. కంటెస్టెంట్లను ఎలా డీల్ చేయనున్నాడు.. ఈ సీజన్ హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్ ఎవరు కానున్నారు.. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలు ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేస్తున్నాయి. ఇన్ని అంచనాల మధ్య సెప్టెంబర్ 5న ఈ షో మొదలు కానుంది.

ఈ కొత్త సీజన్ లో హీరో నిఖిల్, జబర్ధస్ ప్రియాంకా సింగ్, సురేఖా వాణీ, యాంకర్ రవి, యాంకర్ రవి, 7 ఆర్ట్స్ సరయు సుమన్, మహా న్యూస్ లహరి, కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్, యాంకర్ కమ్ నటుడు లోబో, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, ఫోక్ సింగర్ కోమలి, యాంకర్ కమ్ నటి వర్షిణి, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, సీరియల్ నటి నవ్య స్వామి, క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ స్టార్ దుర్గారావు పేర్లు కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.

అయితే.. ఈ సీజన్ విన్నర్ ఎవరు.. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న కంటెస్టెంట్ల పేర్లలో ఈ సీజన్ విన్నర్ ఎవరు కానున్నారన్నది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. కాగా, ఈ సీజన్ లేడీ కంటెస్టెంట్లకు విన్నర్ అయ్యే అవకాశం ఉందని కొందరి వాదన. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలో టైటిల్ గెలుచుకున్నది మగవాళ్లే..  అయితే, ఫస్ట్ సీజన్‌లో హరితేజ, రెండవ సీజన్‌లో గీతామాధురి, మూడో సీజన్‌లో శ్రీముఖీ  చివరి వరకు పోరాడారు. నాల్గవ సీజన్‌లో మహిళా కంటెస్టెంట్లు ఎవరికీ కూడా అంతకుముందు వచ్చిన పాపులారిటీ దక్కలేదు. కానీ, ఈ సీజన్‌లో మాత్రం అమ్మాయినే బిగ్‌బాస్ విన్నర్‌ని చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఐదవ సీజన్‌లో లేడీ కంటెస్టెంట్లకు గెలిచే అవకాశం ఉందని, షో యాజమాన్యం కూడా మహిళా కంటెస్టెంట్లను స్ట్రాంగ్‌గా ఉండేలా ఎంపిక చేసిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికి ఇంకా షో మొదలు కాలేదు.. కానీ లేడీ విన్నర్ కోసమే ఈసారి లేడీ కంటెస్టెంట్లను ఎక్కువమందితో పాటు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేవారినే ఎంపిక చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, షో మొదలై కంటెస్టెంట్లు ఎవరన్నది రివీల్ అయితే దీనిపై కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉండనుంది.