నన్ను ఎవడూ.. ఏమీ పీకలేరు : బిగ్ బాస్ కౌశల్ ఉగ్రరూపం

నన్ను ఎవడూ ఏమీ పీకలేరు అంటూ బిగ్ బాస్ 2 విజేత కౌశల్ వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై రెస్పాండ్ అయ్యాడు. తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారా ? కౌశల్ ఎదగడం ఇష్టం లేని వారు ఇలా చేస్తున్నారంటూ ఉగ్రరూపం ప్రదర్శించారు. కౌశల్ ఆర్మీ తిరుగుబాటు చేసిందని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమ చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తాడని, బిగ్ బాస్ 2లో విజేతగా వచ్చిన డబ్బు దుర్వినియోగం చేస్తున్నారంటూ కౌశల్ ఆర్మీ సభ్యులుగా చెప్పుకుంటున్న కొంతమంది రచ్చరచ్చ చేశారు.
Read Also : సుబ్బరాజు బర్త్ డేను పండగ్గా చేసుకున్న జపాన్ ఫ్యాన్స్
ఆ డబ్బు దుర్వినియోగం కాలేదు :
ఫిబ్రవరి 28వ తేదీ గురువారం కౌశల్, ఆయన సతీమణి మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. బిగ్ బాస్ 2 విజేతగా వచ్చిన డబ్బు దుర్వినియోగం చేయలేదని, విరాళాలు అందచేస్తున్నానని, తన ఫేస్ బుక్‌లో వీటికి సంబందిత వివరాలున్నాయన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే యూసుఫ్ గూడలో ఉన్న తన ఆఫీసుకు రావొచ్చని సూచించారు. కౌశల్ ఆర్మీ వ్యవస్థాపకుడు ఓ వ్యక్తి అని చెబుతున్నాడని, అసలు అతను కానే కాదని, కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దానిని స్థాపించినట్లు చెప్పుకొచ్చారు.
భార్యకు క్యాన్సర్ :
తన భార్యకు కూడా క్యాన్సర్ ఉందని, ఆమెపై కూడా ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. బిగ్ బాస్ 2 హౌస్ లో కొన్ని రోజులు పాటు ఉంటే తానే అన్నీ చక్కదిద్దేదని, తనకు ఎవరూ మేనేజర్ లేదని చెప్పుకొచ్చిన కౌశల్..తన భార్యే మేనేజర్ అని తెలిపారు. ఒక సినిమాలో హీరోగా చూసిన అనంతరం తాను ఆపరేషన్ చేసుకుంటానని చెబుతూ..తనకు సహకరిస్తున్న భార్యపై ఎందుకు ఆరోపణలు చేస్తారని నిలదీశారు.
Read Also : కశ్మీర్ సమస్య కు పరిష్కారం కేసిఆర్ చూపగలరు
పవర్ స్టార్ అంటే విపరీతమైన అభిమానం :
కౌశల్ ఆర్మీని తాను క్రియేట్ చేయలేదని, బిగ్ బాస్ 2లో విజేతగా వచ్చిన అనంతరం ఆర్మీ అని కొంతమంది పేరు పెట్టుకున్నారని వివరించారు. కౌశల్ ఆర్మీని ముందుకు తీసుకెళ్లేందుకు తాను కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు పిచ్చి..ఎంతో అభిమానమన్నారు. ఆయన్ను ఎందుకు విమర్శిస్తానని..ఆయన స్పూర్తితో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో కళ్యాణ్ దిలీప్ సుంకర మేసేజ్ చేశారని, తాను ఎక్కడా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించలేదన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై సైబర్ క్రైంలో కేసు నమోదు చేసినట్లు కౌశల్ వెల్లడించారు.