Bigg Boss 4: కుమార్ సాయి ఎలిమినేషన్!..

  • Published By: sekhar ,Published On : October 18, 2020 / 02:04 PM IST
Bigg Boss 4: కుమార్ సాయి ఎలిమినేషన్!..

Updated On : October 18, 2020 / 2:18 PM IST

Bigg Boss 4 Telugu-Kumar Sai: కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 4’ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారబ్బా అంటూ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటివరకు అయిదుగురు ఎలిమినేట్ కాగా గంగవ్వ అనారోగ్యం కారణంగా ఇంటిబాట పట్టింది. డైరెక్టర్ సూర్య కిరణ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి, టీవీ9 దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయ్యారు.


Bigg Boss హౌస్‌‌లో ఆరో వారం నామినేషన్‌ ప్రక్రియ గత వారాలతో పోలిస్తే ప్రశాంతంగానే ముగిసింది. హౌస్‌లో మెంబర్స్ అంతా మెహబూబ్‍‌ని టార్గెట్ చేస్తే.. చివరికి ఫ్రెండ్‌షిప్ అతణ్ని సేఫ్ అయ్యేలా చేసింది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.


ఈ నేపథ్యంలో ముందుగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం కుమార్ సాయిని బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేయనున్నారని తెలుస్తోంది.
దేత్తడి హారిక, సోహైల్.. కుమార్ సాయిని నామినేట్ చేయగా కుమార్ సాయి వారిద్దరని నామినేట్ చేశాడు. చివరకు తనే ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. డైరెక్టర్ కావడం తన డ్రీమ్ అని నాగార్జున సార్‌ని ఎలాగైనా కథ చెప్పి ఒప్పిస్తానని చెప్పిన కుమార్ సాయి తన కల నెరవేరకుండానే నిష్క్రమించాడు.