Bigg Boss 7 Day 28 : అందరూ కలిసి రతికని పంపించేశారుగా.. వరుసగా నాలుగో లేడీ కంటెస్టెంట్ అవుట్..

బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున శివాజీ, సందీప్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ కోపంలో కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చి శివాజీ పవరాస్త్రని తీసేసుకున్నాడు నాగ్.

Bigg Boss 7 Day 28 : అందరూ కలిసి రతికని పంపించేశారుగా.. వరుసగా నాలుగో లేడీ కంటెస్టెంట్ అవుట్..

Bigg Boss 7 Day 28 Highlights Rathika Eliminated from Bigg Boss

Updated On : October 2, 2023 / 8:23 AM IST

Bigg Boss 7 Day 28 :  బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున శివాజీ, సందీప్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ కోపంలో కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చి శివాజీ పవరాస్త్రని తీసేసుకున్నాడు నాగ్. ఇక నిన్న ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ లో శివాజీ ఎందుకు నా పవరాస్త్రని తీసుకున్నారో చెప్పాలని నాగ్ ని అడగడంతో అతని దగ్గర్నుంచే పవరాస్త్ర ఎందుకు తీసుకోమన్నారో కంటెస్టెంట్స్ ని కారణాలు చెప్పమన్నాడు నాగ్. ఉన్నవాళ్ళంతా తలో కారణం చెప్పారు.

అనంతరం వీకెండ్ కాబట్టి ఉన్న కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టి బొమ్మ గీయి, గెస్ చేయి అనే గేమ్ పెట్టాడు. ఒక బౌల్ లో ఉన్న చీటీలను తీసుకుంటే అందులో ఉన్న సినిమా పేర్లని బొమ్మల రూపంలో గీస్తే మిగిలిన కంటెస్టెంట్స్ చెప్పాలి. ఈ గేమ్ కాసేపు సాగింది. గేమ్ ఆడిస్తూనే మధ్యలో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని సేవ్ చేసుకుంటూ వచ్చారు. చివరికి తేజ, రతిక మిగిలిపోవడంతో రతిక ఎలిమినేట్ అయిందని నాగ్ ప్రకటించాడు.

Also Read : Bigg Boss 7 Day 27 : సందీప్, శివాజీలపై ఫైర్ అయిన నాగార్జున.. వీకెండ్ మొత్తం శివాజీ పైనే..

దీంతో రతిక ఏడుస్తూ ఇంటి నుంచి బయటకి వచ్చింది. స్టేజి పైకి వచ్చినప్పుడు బిగ్‌బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో నచ్చని అంశాలు చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోయింది. రతిక ఏడుస్తుండటంతో నాగ్ కూడా ఓదార్చాడు. అసలు టాప్ లో ఉంటుందన్న కంటెస్టెంట్ ఇలా అర్దాంతరంగా నాలుగో వారమే వెళ్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే రతికకి బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన బ్యూటీతో కూడా పాపులారిటీ తెచ్చుకొని బిగ్‌బాస్ కి రేటింగ్ తెచ్చిపెట్టింది. సడెన్ ఆ ఇలా రతికని పంపించడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. వరుసగా నాలుగో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం గమనార్హం.