Bigg Boss 7 Day 35 : సరికొత్తగా బిగ్‌బాస్.. వైల్డ్ కార్డుతో ఏకంగా హౌస్‌లోకి అయిదుగురు ఎంట్రీ..
వరుసగా ఐదోవారం లేడీ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఎలిమినేషన్ అయిన తర్వాత బిగ్‌బాస్ లోకి కొత్తగా వైల్డ్ కార్డు ఎంట్రీతో మరో అయిదుగురిని పంపించారు.

Bigg Boss 7 Day 35 Highlights Five Members entry in Bigg Boss with Wild Card Entry
Bigg Boss 7 Day 35 : బిగ్‌బాస్ ఐదోవారం కూడా పూర్తయింది. వీకెండ్ ఎపిసోడ్ అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుందని తెలిసిందే. ఈ వారం ఎపిసోడ్ మొదట్లోనే ఎలిమినేషన్ ప్రకటించి శుభశ్రీని ఎలిమినేట్ చేసేసారు. వరుసగా ఐదోవారం లేడీ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఎలిమినేషన్ అయిన తర్వాత బిగ్‌బాస్ లోకి కొత్తగా వైల్డ్ కార్డు ఎంట్రీతో మరో అయిదుగురిని పంపించారు.
సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శవాలి(Bhole Shavali), యూట్యూబర్, నటి నయని పావని(Nayani Pavani), సోషల్ మీడియా పర్సన్, ఇప్పుడిప్పుడే నటిగా ఎదగాలనుకుంటున్న అశ్విని శ్రీ(Ashwini Sri), సీరియల్ నటుడు అర్జున్ అంబటి(Arjun Ambati), సీరియల్ నటి పూజా మూర్తి(Pooja Murthi)లను నాగార్జున(Nagarjuna) వేదికపైకి పిలిచి బిగ్‌బాస్ హౌస్ లోకి పంపించాడు.
Also Read : Bigg Boss 7 : శుభ శ్రీ ఎలిమినేట్.. బిగ్‌బాస్ చరిత్రలో ఇలా మొదటి సారి..
వీటి మధ్యలో వీకెండ్ ఎంటర్టైన్మెంట్ లో భాగంగా సిద్దార్థ్ తన చిన్నా ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ తో సరదాగా గడిపాడు. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో భాగంగా వచ్చి కాసేపు కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేశాడు.