Bigg Boss 8 Nominations : అప్పుడే నామినేషన్లు.. సగం నామినేషన్లు పూర్తి..
నిన్నటి మంగళవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ వేయమన్నారు. అయితే ఆల్రెడీ చీఫ్ గా ఉన్న ముగ్గురిని బిగ్ బాస్ నామినేషన్స్ నుంచి సేవ్ చేసాడు.
Bigg Boss 8 Nominations : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్పుడే నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టింది. మొదటి రోజు నుంచే హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఇక చీఫ్ ల ఎంపిక కోసం జరిగిన టాస్కులతో గొడవలు కూడా అయ్యాయి. నిన్నటి మంగళవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ వేయమన్నారు. అయితే ఆల్రెడీ చీఫ్ గా ఉన్న ముగ్గురిని బిగ్ బాస్ నామినేషన్స్ నుంచి సేవ్ చేసాడు.
ఆ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్లంతా ఒక్కొక్కరు ఇద్దర్ని నామినేట్ చేయాలని, ఆ ఇద్దరిలో చీఫ్ గా ఉన్నవాళ్లు ఒకరిని ఫైనల్ చేస్తారని బిగ్ బాస్ చెప్పాడు. సోనియా – బేబక్క, ప్రేరణలను నామినేట్ చేయగా బేబక్కను ఫైనల్ చేసారు. నబీల్ – నాగమణికంఠ, బేబక్కలను నామినేట్ చేయగా చీఫ్ లు నాగమణికంఠని నామినేట్ చేసారు. శేఖర్ బాషా – నాగమణికంఠ, బేబక్కలను నామినేట్ చేయగా చీఫ్ లు నాగమణికంఠని ఫైనల్ చేసారు. బేబక్క – పృథ్వి, నబీల్ ని నామినేట్ చేయగా చీఫ్ లు పృథ్వీని నామినేట్ చేసారు.
Also Read : Viswam Teaser : గోపీచంద్ ‘విశ్వం’ టీజర్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ.. నవ్వులే నవ్వులు
ఈ నామినేషన్స్ పర్వం నేటి ఎపిసోడ్ లో కూడా సాగనుంది. అయితే బిగ్ బాస్ లీకుల ప్రకారం మొదటివారం పృథ్వి, నాగమణికంఠ, శేఖర్ బాషా, సోనియా, బేబక్కలు నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఫైనల్ గా ఇవాళ్టి ఎపిసోడ్ తర్వాత మొదటివారం నామినేషన్స్ లో ఎవరు ఉంటారో చూడాలి.