Bigg Boss 8 : బిగ్ బాస్ మొదటి వారం వీళ్లల్లో ఎలిమినేట్ అయ్యేదెవరు? ఆదివారం ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎలిమినేషన్..

తాజాగా నేడు ఆదివారం టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.

Bigg Boss 8 : బిగ్ బాస్ మొదటి వారం వీళ్లల్లో ఎలిమినేట్ అయ్యేదెవరు? ఆదివారం ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎలిమినేషన్..

Bigg Boss 8 Sunday Episode Promo Released Who Will Eliminate on First Week

Updated On : September 8, 2024 / 11:27 AM IST

Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలయి అప్పుడే వారం అయిపోయింది. వారంలోనే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అలకలు, ఏడుపులు, గ్రూపులు సాగాయి. ఆదివారం వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుందని తెలిసిందే. మొదటివారం నామినేషన్స్ లో బేబక్క, నాగ మణికంఠ, సోనియా, విష్ణుప్రియ, పృథ్వి, శేఖర్ భాష.. ఇలా ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా సోనియాని నిన్న శనివారం నాగార్జున సేవ్ చేసేసారు.

తాజాగా నేడు ఆదివారం టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో అబ్బాయిలను, అమ్మాయిలను సపరేట్ టీమ్స్ గా చేసి పలు గేమ్స్ పెట్టి ఆడించినట్టు చూపించారు. ఇక గేమ్స్ లో గెలిసిన టీమ్స్ డ్యాన్సులతో సందడి చేశారు. చివరగా ఎలిమినేషన్ ప్రక్రియ చూపించారు. సోనియా నిన్న సేవ్ అవ్వడంతో మిగిలిన అయిదుగురులోనే ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే ఉత్కంఠ నెలకొంది.

Also Read : Mathu Vadalara 2 Trailer : ‘మత్తు వదలరా 2’ ట్రైలర్ రిలీజ్.. సత్య, శ్రీ సింహ కామెడీతో నవ్వించేశారుగా..

అయితే ఆల్రెడీ ఎపిసోడ్ షూట్ అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ లీకుల ప్రకారం బేబక్క మొదటి వారం ఎలిమినేట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. మరి అధికారికంగా తెలియాలంటే ఇవాళ్టి రాత్రికి వచ్చే ఎపిసోడ్ చూడాల్సిందే.