Rathika Rose : భగవంత్ కేసరి సినిమాలో ఇటీవల ఎలిమినేట్ అయిన బిగ్‌బాస్ భామ.. ఎవరు? ఏ పాత్రలో?
భగవంత్ కేసరి సినిమాలో ఇటీవల బిగ్‌బాస్(Bigg Boss) నుంచి ఎలిమినేట్ అయిన రతిక రోజ్ నటించింది.

Bigg Boss Fame Rathika Rose Plays a role in Balakrishna Bhagavanth Kesari Movie
Rathika Rose : అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari) నేడు అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) నటించగా శ్రీలీల(Sreeleela) బాలయ్య బాబుకి కూతురి పాత్రలో నటించింది. ఈ సినిమాలో అనేక మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఓ నటి పేరు ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.
భగవంత్ కేసరి సినిమాలో ఇటీవల బిగ్‌బాస్(Bigg Boss) నుంచి ఎలిమినేట్ అయిన రతిక రోజ్ నటించింది. రతిక రోజ్.. ఒకప్పుడు ఎవ్వరికి తెలీదు. కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా వచ్చి తన అందాలతో, తన ఆటతో ప్రేక్షకులని మెప్పించింది. బిగ్‌బాస్ తో రతికకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే వచ్చింది.
రతిక గతంలో నారప్ప, దృశ్యం 2, నేను స్టూడెంట్ సర్.. లాంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. తాజాగా నేడు రిలీజయిన భగవంత్ కేసరి సినిమాలో రాష్ట్ర మంత్రిగా చిన్న పాత్ర చేసింది. సినిమాలో ఓ మూడు సార్లు కనిపిస్తుంది రతిక. అయితే స్క్రీన్ పై ఎక్కువసేపు కనిపించకపోయినా ఇంగ్లీష్ లో మాట్లాడే మంత్రిగా ప్రేక్షకులని కాసేపు మెప్పించింది.
Also Read : Varun Tej : పెళ్ళికి ముందే గుమ్మడికాయ కొట్టేసిన వరుణ్.. ఇక ఇటలీకి ప్రయాణమే..
ఇక రతిక స్క్రీన్ పై కనపడగానే ఆడియన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అరుపులు, విజిల్స్ తో సందడి చేశారు. దీంతో రతిక సినిమాలో ఉన్న సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు బాలకృష్ణ సినిమాలో నటించినందుకు రతికని అభినందిస్తున్నారు.